Etala Rajender : కేసీఆర్ కనిపిస్తే నమస్కరిస్తా

Update: 2025-05-30 05:30 GMT

బీజేపీలో బీఆర్ఎస్ విలీన వార్తలపై ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. బీఆర్ఎస్ నుంచే విలీన ప్రతిపాదన వచ్చి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. తమది స్టేట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ కాదని.. బీజేపీ నుంచి ప్రపోజల్ వెళ్లి ఉండదని అన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని అనుకోవడం లేదని అన్నారు. కేసీఆర్, రేవంత్ ఇద్దరూ తెలంగాణను ముంచారని ఫైరయ్యారు. వరంగల్ బీఆర్ఎస్ సభలో ఆపరేషన్ కగారు ఆపాలని, ఈ విషయంలో కేంద్రానికి లేఖ రాస్తానని కూడా కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, కానీ తెలంగాణలో మాత్రం అప్పులతో ఇబ్బంది పడే పరిస్థితి దాపురించిందన్నారు.

రాష్ట్రం శరవేగంగా ఆర్థికాభివృద్ధి చెందాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని ప్రజలు భావిస్తున్నారని స్పష్టం చేశారు ఈటల. నేతల మధ్య కంచెలు నాటింది కేసీఆర్ అని, దాన్ని సీఎం రేవంత్ కొనసాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఎదురుపడితే నమస్కారం పెడతానని, అది తన సంస్కా రమన్నారు. బాధ్యయుతమైన ఎంపీగా కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు అవుతాననని ఈటల వెల్లడించారు. కాళేశ్వరం కమిషన్ ముందుకు బీజేపీ పార్లమెంట్ సభ్యుడిగానే వెళ్తానని, గతంలో మంత్రిగా బాధ్యతగల వ్యక్తిగా విచారణకు హాజరవుతానన్నారు. న్యాయం, చట్టాన్ని గౌరవించే పార్టీ బీజేపీ అని పునరుద్ఘాటించారు. 

Tags:    

Similar News

Telangana Municipal Polls :