శంషాబాద్ ఎయిర్‌పోర్టులో లైంగిక వేధింపుల కలకలం
తనకు సహకరిస్తే అనుకూలమైన ప్రదేశాల్లో డ్యూటీలు వేయిస్తాంటూ వేధిస్తున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.;
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది.. ఇండిగో ఎయిర్‌లైన్స్ అనుబంధ సంస్థ ఉద్యోగి.. మహిళా ఉద్యోగులను లైంగిక వేధింపులకు గురిచేయడంతో పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.
వేధింపులు పెరిగిపోవడంతో భరించలేక బాధితులు ఆర్జీఐఏ పోలీసులను ఆశ్రయించారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ అనుబంధ సంస్థ ఏజిల్‌లో పనిచేస్తున్న కొందరు యువతులు, మహిళలను శ్రీకాంత్ అనే ఉద్యోగి టార్గెట్‌గా చేసుకుని లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఉద్యోగినులు ఆరోపిస్తున్నారు.
తనకు సహకరిస్తే అనుకూలమైన ప్రదేశాల్లో డ్యూటీలు వేయిస్తాంటూ వేధిస్తున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏజిల్ కంపెనీకి చెందిన మరికొందరు శ్రీకాంత్‌కు సహకరిస్తున్నారని వారు ఆరోపించారు.