జగిత్యాలలో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. చచ్చిపోతున్నా బాబోయ్.. నన్ను పట్టించుకోండి సార్ అంటున్నా పట్టించుకోకుండా వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. గంటపాటు బెడ్ కిందనే పడిపోయి ఉన్న పేషంట్ భూమయ్య గౌడ్‌ను చూసీ చూడనట్లు వైద్యులు వ్యవహరించారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామానికి చెందిన బళ్లారి భూమయ్య గౌడ్ అనారోగ్యంతో బాధ పడుతుండటంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి వెళ్లిపోయారు. పక్కనున్న పేషెంట్ మీడియాకు సమాచారం ఇవ్వడంతో భూమయ్య గౌడ్‌కు వైద్యులు చికిత్స ప్రారంభించారు.