Hyderabad: సంచలనం సృష్టిస్తున్న ఐటీ సోదాలు
30 చోట్ల ఏకకాలంలో ఐడీ రైడ్స్ జరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్, ఫార్మా, ఇన్ఫ్రా కంపెనీలపై దాడులు చేస్తున్నారు;
హైదరాబాద్‌లో ఐటీ సోదాలు సంచలనం సృష్టిస్తున్నాయి. 30 చోట్ల ఏకకాలంలో ఐడీ రైడ్స్ జరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్, ఫార్మా, ఇన్ఫ్రా కంపెనీలపై దాడులు చేస్తున్నారు. కోహినూరు డెవలపర్స్ కార్యాలయం, ఇళ్లలోను, కోహినూరు ఇన్ఫ్రా డైరెక్టర్ల నివాసాలు, ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు. మాదన్న పేట్, కొండాపూర్, మెహిదీపట్నం పలు ప్రాంతల్లో సోదాలు చేస్తున్నారు. ఉ. 5 గంటల నుంచి టీంలుగా బయలు దేరిన ఐటీ అధికారులు.... ఈ కంపెనీలపై దాడులు చేస్తున్నారు. ఐటీ రిటర్న్, పన్నుల చెల్లింపులో భారీ తేడాలు గుర్తించినట్లు తెలుస్తోంది