JOBS: అంగన్‌వాడీలో ఖాళీల భర్తీ ఇంకెప్పుడు..?

అంగన్​వాడీ కేంద్రాల్లో 20 శాతం పోస్టులు ఖాళీ.. 6,399 టీచర్​, 7,837 హెల్పర్​ పోస్టులు;

Update: 2025-07-07 02:30 GMT

తె­లం­గా­ణ­లో­ని అం­గ­న్​­వా­డీ కేం­ద్రా­ల్లో దా­దా­పు 20 శాతం పో­స్టు­లు ఖా­ళీ­గా ఉన్నా­యి. టీ­చ­ర్లు, హె­ల్ప­ర్లు లే­క­పో­వ­డం­తో కొ­న్ని­చో­ట్ల రో­జు­వా­రీ ని­ర్వ­హణ, పూ­ర్వ ప్రా­థ­మిక వి­ద్యా బోధన, పో­ష­కా­హా­రం అం­దిం­చ­డం కష్టం­గా మా­రు­తోం­ది. పక్కా భవ­నా­లు, సి­బ్బం­ది లే­క­పో­వ­డం­తో ఏజె­న్సీ­లు, ఇతర ప్రాం­తా­ల్లో కొ­న్ని అం­గ­న్‌­వా­డీ కేం­ద్రాల ని­ర్వా­హణ కష్ట­త­రం­గా మా­రు­తోం­ది. మహి­ళా, శిశు సం­ర­క్ష­ణ­లో భా­గం­గా ఏర్పా­టు చే­సిన అం­గ­న్‌­వా­డీ కేం­ద్రా­ల్లో ఖా­ళీ­గా ఉన్న టీ­చ­ర్‌, ఆయా పో­స్టు­ల­ను భర్తీ చే­య­క­పో­వ­డం­తో ఇబ్బం­దు­లు ఎదు­ర్కొం­టు­న్నా­రు.

సాంకేతిక సమస్యలు

65 ఏళ్లు నిం­డిన వా­రి­ని ఉద్యోగ వి­ర­మణ చే­యి­స్తు­న్న ప్ర­భు­త్వం, వా­టి­ని భర్తీ చే­య­క­పో­వ­డం­తో ఖా­ళీల సం­ఖ్య పె­రు­గు­తోం­ది. దీం­తో ప్ర­భు­త్వం ఈ పరి­స్థి­తి­ని అధి­గ­మిం­చేం­దు­కు అం­గ­న్​­వా­డీ కేం­ద్రా­ల్లో ఖా­ళీ­ల­ను భర్తీ చే­యా­ల­ని ని­ర్ణ­యి­చిం­ది. మొ­త్తం 14,236 పో­స్టు­ల­కు శిశు సం­క్షేమ శాఖ ఆమో­దం తె­లి­పిం­ది. కానీ నో­టి­ఫి­కే­ష­న్ల జా­రీ­కి సాం­కే­తిక సమ­స్య­లు ఎదు­ర­వు­తు­న్నా­యి. రెం­డు రో­జుల క్రి­తం దీ­ని­పై సం­క్షేమ శాఖ మం­త్రి సీ­త­క్క సమీ­క్ష ని­ర్వ­హిం­చా­రు. త్వ­ర­గా పో­స్టుల భర్తీ­కి చర్య­లు తీ­సు­కో­వా­ల­ని అధి­కా­రు­ల­కు ఆదే­శిం­చా­రు. మొ­త్తం ఖా­ళీ­ల్లో 6,399 టీ­చ­ర్​, 7,837 హె­ల్ప­ర్​ పో­స్టు­లు ఉన్నా­యి.

ఇతర రాష్ట్రాల్లో పరిశీలన..

తె­లం­గా­ణ­లో 35,700 అం­గ­న్‌­వా­డీ కేం­ద్రా­లు ఉన్నా­యి. ఒక్కో కేం­ద్రం­లో టీ­చ­ర్‌­తో పాటు హె­ల్ప­ర్‌ తప్ప­ని­స­రి­గా ఉం­డా­లి. గతం­లో ఈ పో­స్టు­ల­కు ఎం­పి­కైన వా­రి­లో పలు­వు­రు రి­జై­న్​ చే­య­డం, ఇప్ప­టి­కే పని చే­స్తు­న్న వా­రి­కి సూ­ప­ర్‌­వై­జ­ర్లు­గా పదో­న్న­తు­లు రా­వ­డం­తో సి­బ్బం­ది కొరత ఏర్ప­డిం­ది. 65 ఏళ్లు నిం­డిన టీ­చ­ర్లు, సహా­య­కు­లు ఉద్యోగ వి­ర­మణ చే­శా­రు. ఖా­ళీ­లు ఎక్కు­వ­గా ఏజె­న్సీ ప్రాం­తా­ల్లో ఉన్నా­యి. అక్క­డి కేం­ద్రా­ల్లో స్థా­నిక ఆది­వా­సీ­లు, గి­రి­జ­ను­ల్ని ని­య­మిం­చి, వా­రి­తో­నే పూ­ర్వ ప్రా­థ­మిక వి­ద్య­ను మా­తృ­భా­ష­లో అం­దిం­చా­ల­ని సర్కా­ర్​ భా­వి­స్తోం­ది. ఈ మే­ర­కు ని­యా­మ­కా­లు చే­ప­ట్టేం­దు­కు సాం­కే­తిక అడ్డం­కు­లు ఎదు­ర­వు­తు­న్నా­యి. ఇతర రా­ష్ట్రా­ల్లో పరి­శీ­లిం­చి .. గతం­లో ఏజె­న్సీ ప్రాం­తా­ల్లో­ని ఉద్యో­గా­ల్లో స్థా­నిక ఆది­వా­సీ­ల­కు ప్ర­త్యేక రి­జ­ర్వే­ష­న్లు ఉం­డే­వి. ఈ రి­జ­ర్వే­ష­న్ల జీ­వో­ను సు­ప్రీం­కో­ర్టు కొ­ట్టి­వే­సిం­ది. సా­ధా­రణ ఉద్యోగ ప్ర­క­టన కింద నో­టి­ఫి­కే­ష­న్‌ ఇస్తే మా­తృ­భా­ష­లో వి­ద్యా­బో­ధన కష్ట­మ­వు­తుం­ద­ని అం­చ­నా వే­స్తోం­ది. నో­టి­ఫి­కే­ష­న్లో సం­బం­ధిత భా­ష­లు తె­లి­సి ఉం­డా­ల­న్న ని­బం­ధన చే­ర్చి­తే ఎలా ఉం­టుం­ది అన్న వి­ష­యా­న్ని పరి­శీ­లి­స్తోం­ది.

Tags:    

Similar News