Jr NTR_Amit Shah: అమిత్‌షాతో ఎన్టీఆర్ భేటీ.. రాజకీయపరంగానే అంటూ అనుమానాలు..
Jr NTR_Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ అవుతున్నారు.;
Jr NTR_Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ అవుతున్నారు. అమిత్ షా- ఎన్టీఆర్ కలిసి రాత్రి డిన్నర్ కూడా చేస్తారని స్వయంగా బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇవాళ మునుగోడుకు వస్తున్న అమిత్‌షా.. బిజీ షెడ్యూల్‌లోనూ ఎన్టీఆర్ కోసం సమయం కేటాయించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ వచ్చిన తరువాత వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్న అమిత్ షా.. సాయంత్రం సమయంలో ఎన్టీఆర్‌కు 15 నిమిషాల పాటు అపాయింట్‌మెంట్ ఇచ్చారని చెబుతున్నారు.
మునుగోడులో ప్రసంగించిన తరువాత.. అమిత్‌షా రామోజీ ఫిల్మ్‌సిటీకి వెళ్తున్నారు. ఆ తరువాత నొవాటెల్ చేరుకుంటారు. దాదాపు రాత్రి 8 గంటల సమయంలో ఎన్టీఆర్‌ను అమిత్‌షా కలుస్తారని చెబుతున్నారు. అమిత్‌షా ఈమధ్యే ట్రిపుల్‌ఆర్ మూవీ చూశారని, సినిమాలో ఎన్టీఆర్ నటన నచ్చడంతో కలిసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని చెప్పుకుంటున్నారు. అయితే, అభిమానులు, తెలుగు ప్రజలు మాత్రం.. అమిత్‌షా-ఎన్టీఆర్ భేటీని రాజకీయ కోణంలో చూస్తున్నారు. ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరుగుతాయన్న దానిపై ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.