KA Paul: రేపో మాపో కేసీఆర్ అరెస్ట్ కావడం ఖాయం- కేఏ పాల్
KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.;
KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం తానేనన్నారు. హైదరాబాద్ రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైని కలిసిన అనంతరం కేఏ పాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అక్రమ పాలన అంతం చేయడానికే అమెరికా నుంచి వచ్చానన్నారు.
కేసీఆర్‌కు 30 సీట్లు కూడా రావని.. ప్రశాంత్ కిశోరే చెప్పారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జార్జ్ బుష్, బిల్ క్లింటన్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చింది తానేనన్నారు కేఏ పాల్. అటు.. ఆంధ్ర అంధకారంలోకి వెళ్లిందన్నారు కేఏ పాల్. అప్పుల పాలు చేశారని విమర్శించారు. 20 ఏళ్లు ఎవరు అధికారంలో ఉన్నా ఏపీ అప్పు తీరదన్నారు. జగన్ పూర్తిగా ఫెయిల్ అయ్యారని విమర్శించారు.