సరస్వతి పుష్కరాల వేళ భారీ వర్షంతో కాళేశ్వరం చిత్తడిగా మారింది. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరేలు భక్తులకు అసౌకర్యాలు కలుగ కుండా యుధ్ధప్రాతిపదికన చర్యలు మొదలు పెట్టారు. వర్షానికి ఇబ్బందులు పడకుండా పుష్కరఘాట్, టెంట్సిటీ, బస్టాండ్ నుండి షటిల్ బస్సుల ఏర్పాటు, దేవాలయంకు చేరుకునే రోడ్డు, తాగునీరు, పారిశుధ్యం పనులు, విద్యుత్, ట్రాఫిక్, పార్కింగ్, తదితర సమస్యలు తలెత్తకుండా విస్తృతంగా పర్యటిస్తూ అధికారులకు సూచనలు చేస్తున్నారు. సౌకర్యాల కల్పనకు రేయింబవళ్ళు ప్రత్యేక కృషి చేస్తున్నారు. ఇద్దరు జిల్లా బాస్లు నిరంతర సేవలందిస్తుండటంపై భక్తుల నుండి ప్రశంసలు అందుకుంటున్నారు. అదే విధంగా దేవాదాయ శాఖ ప్రిన్స్పాల్ సెక్రటరీ శైలజా రామయ్యార్ గురువారం ఈవో కార్యాలయంలో ఏర్పాట్ల పై సమీక్షించా తగు సూచనలు జారీ చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా జిల్లా కలెక్టర్, ఎస్పీ తీసుకుంటున్న చర్యల పై వారు అభినందించారు.