MLC Kavitha : బీసీ బిల్లు కోసం నిరాహార దీక్షకు దిగిన కవిత

Update: 2025-08-04 10:45 GMT

బీసీ బిల్లుపై తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత 42శాతం రిజర్వేషన్ల బిల్లు సాధన కోసం నిరాహార దీక్షకు దిగింది. 72గంటల నిరాహార దీక్షను ఆమె చేపట్టింది. ఈరోజు చేసే పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని కవిత అన్నారు. ముందుగా బీఆర్‌ అంబేద్కర్, పూలే, ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహాలకు ఆమె నివాళి అర్పించారు. కార్యక్రమానికి జాగృతి శ్రేణులు తరలివచ్చి ఆమెకు మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా తెలంగాణలో ప్రతి ఒక్కరికీ రాజ్యాధికారంలో వాటా కావాలి, ఆర్థిక అవకాశాలు రావాలని కవిత అన్నారు. సమాజంలో సగ భాగం బీసీలు ఉన్నారని.. వాళ్లకు రాజకీయంగా సమ ప్రాధాన్యం దక్కాలనే ఉక్కు సంకల్పంతో ఈ దీక్ష చేపట్టినట్లు తెలిపారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో చెప్పినట్లు బీసీలకు న్యాయం చేయాలని గత కొన్ని నెలలుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం వెంట పడుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ మీద నెపం పెట్టి తప్పించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్‌కు ప్రత్యేకంగా పార్లమెంటులో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News