BRS: బీఆర్ఎస్‌లో కొనసాగుతున్న "లేఖ" కాక "

కేసీఆర్‌తో కేటీఆర్ సుదీర్ఘ చర్చలు... గులాబీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ;

Update: 2025-05-26 05:30 GMT

గులాబీ పార్టీలో కవిత లేఖ రచ్చ రేపుతోంది. తెలంగాణ రాజకీయాల్లో కూడా ఎమ్మెల్సీ కవిత లేఖ కలకలం రేపుతోంది. కవిత సొంత పార్టీ పెడుతున్న వార్తలు... కవితను బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేస్తారన్న ప్రచారంతో గులాబీ పార్టీలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌కు వెళ్లిన బీఆర్‌ఎస్‌ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌... అధ్యక్షుడు కేసీఆర్‌తో సుదీర్ఘ చర్చలు జరిపారు. పార్టీలో ఆధిపత్య ధోరణి కనిపిస్తుందా, లేక ఎమ్మెల్సీ కవితకు ప్రాధాన్యం తగ్గిందా అని చర్చ జరుగుతుండగా కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ అయ్యారు. దీంతో బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోందని చర్చ మొదలైంది. " మా మీద విమర్శలు తరువాత చేయండి, ముందు మీ కుటుంబంలో తలెత్తిన సంక్షోభమా.. లేక పార్టీలో తలెత్తిన సంక్షోభమా తేల్చుకోండి" అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కాంగ్రెస్ నేతలు, మంత్రులు కౌంటర్లు వేస్తున్నారు.

డాడీ ఏం చేద్దాం..

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లిన కేటీఆర్ తన తండ్రి కేసీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కవిత లేఖ, ఆమె అసంతృప్తి, బీఆర్ఎస్ రజతోత్సవ సభలో బీజేపీపై విమర్శలు చేయకపోవడం, తనను నొప్పించిన, జైల్లో పెట్టి వేధించిన కమలం పార్టీకి ఎందుకు దగ్గరవుతున్నారనేలా కవిత లేఖలోని అంశాలపై చర్చించేందుకు కేసీఆర్, కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ అంశాలతో పాటు తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు, బీఆర్ఎస్ పోరాట ఫలితంగా రాష్ట్ర అవతరణ అని నిర్వహించాల్సిన కార్యక్రమాలపై సైతం వీరు చర్చించనున్నారని సమాచారం. **కవిత లేఖతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. కాళేశ్వరం నోటీసుల అంశంపైనా డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది. కవిత లేఖ ఎపిసోడ్ తర్వాత తొలిసారి కేసీఆర్ ను కలిశారు కేటీఆర్. తదనంతర పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ ను కేటీఆర్ కలవడం ప్రాధాన్యంత సంతరించుకుంది. **కవితకు పార్టీలో ప్రాధాన్యం తగ్గిందన్న అంశంపైనా చర్చ జరగుతోంది.

బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఉత్కంఠ

బీఆర్‌ఎస్‌లో ఏం జరుగుతోంది అనేది సీనియర్ నేతలకు కూడా ఏమీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. అసలు కేసీఆర్ కుటుంబంలో ఏం జరగబోతోంది? కవిత ఎసిసోడ్ ఏ మలుపు తిరగబోతోంది? బీఆర్ఎస్ లో తదుపరి ఎలాంటి పరిణామాలు ఉంటాయి? అనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒకింత ఆందోళన నింపాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News