KCR Bandi Sanjay : కేసీఆర్ బండి సంజయ్ డైలాగ్ వార్..
KCR Bandi Sanjay : తెలంగాణలో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.;
KCR Bandi Sanjay : తెలంగాణలో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రధాని మోదీ ఈ ఎనిమిదేళ్లలో ఏం ఉద్ధరించారని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. బీజేపీ జెండాను చూసి మోసపోతే.. శఠగోపం తప్పదని హెచ్చరించారు. ఆ జెండాను పట్టుకుంటే మళ్లీ పాతకథే వస్తుందన్నారు.
కేసీఆర్‌కు అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. తెలంగాణకు సీఎం కేసీఆరా? మోడీనా? అని ప్రశ్నించారు. పేదల కోసం మోదీ ఇచ్చిన 2లక్షల 40వేల ఇండ్లను ఎందుకు కట్టడం లేదని దుయ్యబట్టారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు.. ఉపాధి హామీ కూల నిధులు మళ్లిస్తున్నారని ఆరోపించారు.