KCR : ఎంపీలతో సమావేశం కానున్న కేసీఆర్.. దానిపైనే ప్రధాన చర్చ
KCR : సీఎం కేసీఆర్ రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు టీఆర్‌ఎస్ ఎంపీలతో సమావేశం కానున్నారు.;
KCR : సీఎం కేసీఆర్ రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు టీఆర్‌ఎస్ ఎంపీలతో సమావేశం కానున్నారు. ఈనెల 18 నుంచి పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఉభయ సభల్లో అనుసరించాల్సిన విధివిధానాలపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే విధంగా ఉభయ సభల్లో ఆందోళనలు చేపట్టాలని, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని ఎంపీలకు వివరించనున్నారు సీఎం కేసీఆర్.
తెలంగాణకు అన్ని రంగాల్లో నష్టం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తోందని, పార్లమెంటు ఉభయసభల్లో దీనిపై నిరసన తెలపాలని ఎంపీలకు సూచించనున్నారు.