KCR: ఇప్ప టివరకూ ఓ లెక్క ... ఇక నుం చి మరో లెక్క
రేవంత్ సర్కార్ తోలు తీస్తా మన్న కేసీఆర్.. బీఆర్ఎస్ఎల్పీ భేటీ తర్వాత తీవ్ర వ్యాఖ్యలు.. అభివృద్ధి, సంక్షేమంస్తం భించిందన్న కేసీఆర్
తెలంగాణలో గత రెండేళ్లుగా రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా తప్ప ఏమీ లేదని మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు. హైప్ ఆధ్యుడు ఏపీ సీఎం చంద్రబాబు అని, విశాఖలో జరిగిన సదస్సులో వంటవాళ్లతో ఎంఓయూలపై సంతకాలు చేయించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పే లెక్కలు నిజమైతే ఇప్పటికే ఏపీలో 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఉండేవని అన్నారు. కేసీఆర్ తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. గతంలో తొలి ప్రధాని నెహ్రూ హయాంలో కొన్ని రాష్ట్రాల్లో ఐడీపీఎల్ పెట్టారని, మనకు హైదరాబాద్‌లో ఐడీపీఎల్ వచ్చిందని చెప్పారు. డాక్టర్ అంజిరెడ్డి కూడా అక్కడే ఉద్యోగం చేశారని తెలిపారు. తర్వాత కాలంలో హైదరాబాద్ ఫార్మా హబ్‌గా మారిందని, ప్రపంచంలో మూడింటి ఒక వంతు వ్యాక్సిన్ సరఫరా హైదరాబాద్ జినోమ్ వ్యాలీ నుంచే జరుగుతోందని అన్నారు. బచావత్ ట్రిబ్యునల్ గుర్తించినా పాలకుల నిర్లక్ష్యంతో పాలమూరు జిల్లా దుర్భర పరిస్థితిని ఎదుర్కొందని చెప్పారు. 1974లోనే నీటి కేటాయింపులు జరిగినప్పటికీ ఉమ్మడి పాలకులు జూరాల ప్రాజెక్టును పట్టించుకోలేదని విమర్శించారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. “మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకుంటున్నా” అని ప్రకటించి కేవలం పునాది రాళ్లకే పరిమితమయ్యారని ఆరోపించారు. కర్ణాటకకు చెల్లించాల్సిన 13 కోట్ల రూపాయల పరిహారాన్ని కూడా చెల్లించలేదని, తన ఉద్యమం వల్లే ఆ నిధులు విడుదలయ్యాయని గుర్తు చేశారు.
అయితే 1974లోనే నీటి కేటాయింపులు జరిగినప్పటికీ ఉమ్మడి పాలకులు ఆ ప్రాజెక్టును పట్టించుకోలేదని, దశాబ్దాల పాటు కాలువలు లేక జూరాల ఒక అనాథ బ్యారేజీలా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దత్తత తీసుకుని ద్రోహం చేశారని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఘాటు విమర్శలు చేశారు. “మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకుంటున్నా” అని ప్రకటించిన చంద్రబాబు, కేవలం పునాది రాళ్లు వేయడానికే పరిమితమయ్యారని విమర్శించారు. కల్వకుర్తి వంటి ప్రాజెక్టులకు రాళ్లు వేసారే తప్ప, ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని ఆరోపించారు. కర్ణాటకకు చెల్లించాల్సిన 13 కోట్ల రూపాయల పరిహారాన్ని కూడా చెల్లించలేదని, తాను ఉద్యమ సమయంలో చేసిన పోరాటం వల్లే ఆ నిధులు విడుదలయ్యాయని గుర్తు చేశారు.
చంద్రబాబుపై కేసీఆర్ సంచలన విమర్శలు
1974లోనే నీటి కేటాయింపులు జరిగినప్పటికీ ఉమ్మడి పాలకులు ఆ ప్రాజెక్టును పట్టించుకోలేదని, దశాబ్దాల పాటు కాలువలు లేక జూరాల ఒక అనాథ బ్యారేజీలా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దత్తత తీసుకుని ద్రోహం చేశారని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కేసీఆర్ ఘాటు విమర్శలు చేశారు. “మహబూబ్‌నగర్ జిల్లాను దత్తత తీసుకుంటున్నాను” అని ప్రకటించిన చంద్రబాబు, కేవలం పునాది రాళ్లు వేయడానికే పరిమితమయ్యారని విమర్శించారు. కల్వకుర్తి వంటి ప్రాజెక్టులకు రాళ్లు వేసారే తప్ప, ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని ఆరోపించారు. కర్ణాటకకు చెల్లించాల్సిన 13 కోట్ల రూపాయల పరిహారాన్ని కూడా చెల్లించలేదని, తాను ఉద్యమ సమయంలో చేసిన పోరాటం వల్లే ఆ నిధులు విడుదలయ్యాయని గుర్తు చేశారు.