KCR : మునుగోడు బైపోల్స్ పై సీఎం కేసీఆర్ ఫుల్ ఫోకస్..

KCR : మునుగోడు బైపోల్‌పై ఫోకస్‌ పెంచారు సీఎం కేసీఆర్‌. ప్రగతిభవన్‌లో కీలక సమావేశం నిర్వహించారు;

Update: 2022-09-20 09:30 GMT

KCR : మునుగోడు బైపోల్‌పై ఫోకస్‌ పెంచారు సీఎం కేసీఆర్‌. ప్రగతిభవన్‌లో కీలక సమావేశం నిర్వహించారు. కేసీఆర్‌ పిలుపుతో ఉదయమే ప్రగతిభవన్‌కు చేరుకున్నారు మంత్రి జగదీశ్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి. అభ్యర్థిని ప్రకటించే అంశంపై ప్రధానంగా చర్చ కొనసాగినట్లు సమాచారం. మునుగోడు నియోజకవర్గంలో మండలాల వారీగా త్వరలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని సూచించినట్లు తెలుస్తోంది. పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల వైపే కేసీఆర్‌ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆత్మీయ సమ్మేళనాల సందర్భంగా కూసుకుంట్లను హైలెట్‌ చేయాలని మంత్రి జగదీశ్‌ రెడ్డికి సీఎం కేసీఆర్‌ సూచించినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News