khairatabad Ganesh : గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణేశుడు..!
ఈ ఏడాది పంచముఖ రుద్ర మహా గణపతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం హుస్సేన్ సాగర్ లో పూర్తయింది.;
ఈ ఏడాది పంచముఖ రుద్ర మహా గణపతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం హుస్సేన్ సాగర్ లో పూర్తయింది. ఈ మహాగణపతి నిమజ్జనం చూసేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. ఈ రోజు ఉదయం 8.18 గంటలకు ప్రారంభమైన శోభాయాత్ర భక్తుల కోలాహలం మధ్యఎలాంటి ఆటంకాలు లేకుండా సందడిగా కొనసాగింది. ట్యాంక్‌బండ్‌పై తుదిపూజల అనంతరం మహాగణపతి నిమజ్జన ప్రక్రియ పూర్తిచేశారు.