Kishan Reddy : అందుకే బయ్యారం స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం లేదు : కిషన్ రెడ్డి
Kishan Reddy : బయ్యారం స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర వైఖరిని ఇప్పటికే పునరుద్ఘాటించామన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి;
Kishan Reddy : బయ్యారం స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర వైఖరిని ఇప్పటికే పునరుద్ఘాటించామన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. విభజనచట్టంలో బయ్యారం స్టీల్ ప్లాంట్‌పై స్టడీ చేయాలని ఉందని... దీని ప్రకారమే కేంద్రం నిపుణుల కమిటి ఏర్పాటు చేసిందన్నారు. ఈ కమిటి బయ్యారం వెళ్లి అధ్యయనం చేసిందిన్నారు.
అయితే..బయ్యారం స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదని కమిటీ తేల్చి చెప్పిందన్నారు. మోడీ సర్కారు ఏర్పడ్డ ఆర్నెల్లలోపే ఈ ప్రక్రియ పూర్తైందన్నారు. ఫీజిబిలిటీ అంశంపై ప్రపంచ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని కమిటి నివేదిక ఇచ్చిందని...బయ్యారంలో ముడిఖనిజంలో నాణ్యత లేదని కమిటీ చెప్పిందన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా స్టీల్ తయారుచేయలేమని కమిటీ చెప్పిందన్నారు. స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేస్తే మరో ఖాయిల పరిశ్రమగా మారుతుందన్నారు కిషన్‌రెడ్డి.