KODANDARAM: కోదండరాం సార్ భవిష్యత్తు ఏంటి.?

ఆగ్రహంగా ఉన్న తెలంగాణ జన సమితి కార్యకర్తలు;

Update: 2025-08-16 06:30 GMT

తె­లం­గా­ణ­లో గవ­ర్న­ర్ కోటా ఎమ్మె­ల్సీల ని­యా­మ­కం­పై సు­ప్రీం­కో­ర్టు సం­చ­లన తీ­ర్పు­ను ఇచ్చిం­ది. తె­లం­గాణ జన­స­మి­తి అధ్య­క్షు­డు కో­దం­డ­రాం , సీ­ని­య­ర్ జర్న­లి­స్ట్ అమీ­ర్ అలీ­ఖా­న్ ని­యా­మ­కా­ల­ను ని­లి­పి­వే­స్తూ సర్వో­న్నత న్యా­య­స్థా­నం ఆదే­శా­లు జారీ చే­సిం­ది. ఈ తీ­ర్పు­తో ఈ ఇద్ద­రు నేతల ఎమ్మె­ల్సీ పద­వు­లు తా­త్కా­లి­కం­గా రద్ద­య్యా­యి. ఈ ని­యా­మ­కా­ల­పై భారత రా­ష్ట్ర సమి­తి (బీ­ఆ­ర్ఎ­స్) నే­త­లు దా­సో­జు శ్ర­వ­ణ్, సత్య­నా­రా­యణ దా­ఖ­లు చే­సిన పి­టి­ష­న్ల­ను సు­ప్రీం­కో­ర్టు వి­చా­రిం­చిం­ది. సు­ప్రీం­కో­ర్టు తీ­ర్పు­లు తె­లం­గా­ణ­లో కాం­గ్రె­స్ పా­ర్టీ, ప్ర­భు­త్వా­ని­కి వరు­స­గా షా­క్‌­లు ఇస్తు­న్నా­యి. దీం­తో, దా­దా­పు రెం­డే­ళ్ళు­గా సా­ఫీ­గా­నే నడి­చిన ప్ర­భు­త్వా­ని­కి ఇప్పు­డు అన్నీ అప­శ­కు­నా­లే ఎదు­ర­వు­తు­న్నా­యా అన్న చర్చ మొ­ద­లైం­ది రా­జ­కీ­య­వ­ర్గా­ల్లో.. తా­జా­గా బు­ధ­వా­రం­నా­డు సు­ప్రీం కో­ర్ట్‌ ఇచ్చిన తీ­ర్పు కాం­గ్రె­స్‌­కు గట్టి ఎదు­రు­దె­బ్బే­న­న్న వాదన బల­ప­డు­తోం­ది. గవ­ర్న­ర్ కో­టా­లో ఎమ్మె­ల్సీ­లు­గా నా­మి­నే­ట్‌ అయిన కో­దం­డ­రాం, అమీ­ర్ అలీ ఖా­న్‌ల సభ్య­త్వా­ల­ను రద్దు చే­సిం­ది సు­ప్రీం కో­ర్ట్‌. సరైన అర్హ­త­లు లే­వ­ని, అసలు వా­ళ్ళు ఎమ్మె­ల్సీ­లు­గా ప్ర­మా­ణ­స్వీ­కా­రం చే­య­డ­మే తప్పు అంటూ కీలక తీ­ర్పు ఇచ్చిం­ది. అయి­తే.. గతం­లో హై­కో­ర్టు తీ­ర్పు­పై స్టే వి­ధి­స్తూ తా­మి­చ్చిన మధ్యం­తర ఉత్త­ర్వు­ల­ను సవ­రిం­చిం­ది సు­ప్రీం. గతం­లో…బీ­ఆ­ర్‌­ఎ­స్‌ హయాం­లో గవ­ర్న­ర్ కోటా ఎమ్మె­ల్సీ­లు­గా దా­సో­జు శ్ర­వ­ణ్ కు­మా­ర్ కు­ర్రా సత్య­నా­రా­యణ పే­ర్ల­ను ప్ర­తి­పా­దిం­చిం­ది.

టీజేఎస్ నేతల గరంగరం

జే­ఏ­సీ ఛై­ర్మ­న్‌­గా ఎంతో పే­రు­న్న ఆయన..పా­ర్టీ పె­ట్ట­డం ఒక ఎత్తు అయి­తే.. ఆ తర్వాత కాం­గ్రె­స్‌­కు మద్ద­తి­వ్వ­డం మరో ఎత్తు. సరే కాం­గ్రె­స్‌­కు సపో­ర్ట్ చేసి అధి­కా­రం­లో­కి వచ్చే­లా చే­సి­నా..తమకు దక్కిం­దే­మి లే­ద­ని గు­ర్రు­గా ఉన్నా­రట జన­స­మి­తి నే­త­లు. తమ అధి­నే­త­కు ఇచ్చిన పో­స్ట్ కూడా ఊస్ట్‌ అయ్యే­లా చే­శా­ర­ని అస­హ­నం వ్య­క్తం చే­స్తు­న్నా­రట. దీం­తో కో­దం­డ­రాం సార్ ఏదో అను­కుం­టే ఏదో అయిం­ద­న్న చం­దం­గా మా­రిం­దట పరి­స్థి­తి. తె­లం­గాణ జ‌న స‌­మి­తి పా­ర్టీ నే­త­‌­లు అధి­కార కాం­గ్రె­స్ పా­ర్టీ తీ­రు­పై గు­ర్రు­గా ఉన్నా­ర­‌­ట‌. కాం­గ్రె­స్‌­కు అన్ని ర‌­కా­లు­గా స‌­హాయ స‌­హ­‌­కా­రా­లు అం­ది­స్తు­న్నా..ఎన్ని­క­ల్లో గె­లి­చేం­దు­కు అం­డ­గా ని­లి­చి­నా తమకు తగిన గు­ర్తిం­పు ఇవ్వ­డం లే­ద­ని అసం­తృ­ప్తి­తో ఉన్నా­రట. అసెం­బ్లీ ఎన్ని­క­‌­ల్లో ఒక్క సీటు కూడా తీ­సు­కో­కుం­డా భే­ష­‌­ర­‌­తు­గా మ‌­ద్ద­తి­స్తే.. అధి­కా­రం­లో­కి వ‌­చ్చి రెం­డే­ళ్లు అవు­తు­న్నా తమను ప‌­ట్టిం­చు­కో­వ­‌­డం లే­ద‌ం­టు­న్నా­రట.

తె­లం­గాణలో ప్రొ­ఫె­స­‌­ర్ కో­దం­డ­‌­రాం అంటే ప్ర­త్యేక గు­ర్తిం­పు. ఉద్యమ స‌­మ­‌­యం­లో పొ­లి­టి­క­‌­ల్ జే­ఏ­సీ ఛై­ర్మ­న్‌­గా పని­చే­సిన ఆయ­న­కు అన్ని రా­జ­‌­కీ­య‌ పా­ర్టీ­ల­‌­తో పాటు అన్ని వ‌­ర్గా­ల్లో మంచి ఒపీ­ని­య­న్ ఉం­డే­ది. రా­ష్ట్రం ఏర్ప­డ్డాక కూడా జే­ఏ­సీ­ని అలా­గే కొ­న­‌­సా­గి­స్తూ..చి­వ­‌­రి­కి తె­లం­గాణ జ‌­న­‌­స­‌­మి­తి పే­రు­తో పొ­లి­టి­క­‌­ల్ పా­ర్టీ­ని పె­ట్టా­రు. టీ­జే­ఎ­స్‌­ను ఇం­డి­పెం­డెం­ట్‌­గా నడ­ప­కుం­డా ఆయన కాం­గ్రె­స్‌­కు మ‌­ద్ద­తి­వ్వ­డం­పై­నే అప్ప­ట్లో వ్య­తి­రే­కత వ్య­క్త­మైం­ది. 2018 అసెం­బ్లీ ఎన్ని­క­‌­ల్లో కాం­గ్రె­స్‌­తో పొ­త్తు పె­ట్టు­కొ­ని ఎన్ని­క­‌­ల్లో పోటీ చే­సిన టీ­జే­ఎ­స్ ఆ త‌­ర్వాత కాం­గ్రె­స్‌­కు కా­స్త దూ­ర­మైం­ది. పీ­సీ­సీ చీ­ఫ్‌­గా రే­వం­త్ రె­డ్డి బా­ధ్య­త­‌­లు చే­ప­‌­ట్టిన త‌­ర్వాత కాం­గ్రె­స్‌­కు ద‌­గ్గ­రై­య్యా­రు కో­దం­డ­రాం. 2023 అసెం­బ్లీ ఎన్ని­క­‌­ల్లో ఒక్క సీటు కూడా తీ­సు­కో­కుం­డా కాం­గ్రె­స్‌­కు ఔట్‌­రై­ట్‌ సపో­ర్ట్ చే­శా­రు.

Tags:    

Similar News