Kothagudem : కొత్తగూడెం ఏఎస్పీ రోహిత్ రాజ్ అదిరిపోయే డ్యాన్స్... వైరల్ వీడియో
Kothagudem : కొత్తగూడెం ASP రోహిత్ రాజ్ పేరు వినని వారు ఇప్పుడు తెలంగాణలో దాదాపు ఉండకపోవచ్చు.;
Kothagudem : కొత్తగూడెం ASP రోహిత్ రాజ్ పేరు వినని వారు ఇప్పుడు తెలంగాణలో దాదాపు ఉండకపోవచ్చు. ఇటీవల సంచలనం సృష్టించిన పాల్వంచ కుటుంబ ఆత్మహత్యల కేసులో ఆయన దర్యాప్తు చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఎలాంటి పైరవీలకు తావివ్వకుండా.. ఏకంగా ఎమ్మెల్యే తనయుణ్నే అరెస్టు చేశారు. అయితే వృత్తిధర్మం పట్ల ఎంత నిబద్ధతతో ఉంటారో.. వ్యక్తిగత జీవితంలో అంత సరదాగా ఉంటారని ఆయన సహచరులు చెబుతుంటారు. ఐపీఎస్ ఫేర్‌వెల్ ఫంక్షన్ లో రోహిత్ రాజ్ లోని మరో కోణం బయటకు వచ్చింది. సినిమా హీరోలకు తగ్గకుండా.. ఆయన డాన్స్ చేసిన తీరు అందరినీ కట్టిపడేసింది. రోహిత్ రాజ్ డాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.