KTR: రూ.370 కోట్లతో రంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి పనులు.. కేటీఆర్ శంకుస్థాపన..
KTR: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో 370 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు మంత్రి కేటీఆర్;
KTR: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో 370 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు మంత్రి కేటీఆర్. తుక్కుగూడ మున్సిపాలిటి పరిధిలోని 33 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జల్‌పల్లి మున్సిపాలిటిలో పరిధిలోని రోడ్ల విస్తరణ, బడంగ్‌పేటలో 40 కోట్లతో ఓపెన్ నాలా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా ప్రసంగించిన మంత్రి కేటీఆర్.. తెలంగాణ పథకాలు దేశానికి దిక్సూచిగా మారాయన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. తెలంగాణ దేశానికే ఆదర్శంగా మారిందన్నారు.
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే.. కేంద్రం మాత్రం.. సహకరించడం లేదన్నారు మంత్రి కేటీఆర్. వరదలు వచ్చినప్పుడు.. సహాయం చేయలేదన్నారు. కానీ గుజరాత్‌లో వరదలు వచ్చినప్పుడు.. ప్రధాని మోదీ.. హెలికాఫ్టర్ వేసుకుని వెళ్లి మరీ సహాయం చేశారు. రాష్ట్రానికి కేంద్రం కొత్తగా ఒక్కట విద్యాసంస్థని మంజూరు చేయలేదన్నారు. కానీ.. ఇక్కడి బీజేపీ నేతలు మాత్రం.. కేసీఆర్ సర్కారును విమర్శిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.