ముఖ్యమంత్రులను ఉరికించిన చరిత్ర టీఆర్‌ఎస్‌ది : కేటీఆర్
ఉద్యమంలో పాల్గొనని వారు, అసలు తెలంగాణను వ్యతిరేకించిన వారు ఇప్పుడు కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు.;
తెలంగాణ కోసం కేసీఆర్ కాళ్లరిగేలా ఢిల్లీకి తిరిగారన్నారు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉద్యమంలో పాల్గొనని వారు, అసలు తెలంగాణను వ్యతిరేకించిన వారు ఇప్పుడు కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఆరు జిల్లాల టీఆర్‌ఎస్‌వీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేశారు.. ముఖ్యమంత్రులను ఉరికించిన చరిత్ర టీఆర్‌ఎస్‌దని గుర్తు చేశారు. లెక్కలతో సహా ఏమేం చేశామో ప్రజలకు వివరించాలన్నారు. బీజేపీ నేతలు మోచేతికి బెల్లం రాసి నాకమంటున్నారని.. మనకు అన్నిట్లో మొండి చేయి చూపిస్తున్నందుకు బీజేపీకి ఓటు వేయాలా అని కేటీఆర్ నిలదీశారు.