బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. మంచి మనసును చాటుకున్నారు. ఎవరూ లేని యువతి వివాహానికి పెద్ద మనసుతో హాజరై ఆహ్వానించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘ఒక ప్రత్యేకమైన ఆహ్వానం అందింది. నాకు ఇదొక ప్రత్యేకమైన అనుభూతి. ప్రతి అమ్మాయి తన వివాహానికి నాన్న ఆశీర్వాదం, అన్నయ్య అండ కావాలని కోరుకుంటుంది. కానీ నా చెల్లి తన నాన్న, అన్నయ్యను కోల్పోయిన తర్వాత ఆ లోటును తీర్చమని నన్ను పిలిచింది. తాను చనిపోయిన తన అవయవాలు దానం చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆ ఆడబిడ్డ ఆహ్వానం నా మనసును కదిలించింది. ఆమె కోరికను గౌరవించడం నా బాధ్యతగా, కర్తవ్యంగా భావించాను.
తెలంగాణ బిడ్డలే బీఆర్ఎస్ బలం, బలగం. గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన ధ్యానబోయిన నర్సింలు జీవితకాలం బీఆర్ఎస్ అభ్యున్నతి కోసం కృషిచేశారు. చెల్లెలు నవిత ఆనందంలో భాగస్వామి కావడం, ఆమెకు అండగా నిలవడం అన్నగా, ఆత్మీయుడిగా నా బాధ్యత అని భావించాను. మనందరికీ ఒకటే కుటుంబం అని. చెల్లెలు నవిత-సంజయ్ దంపతుల కొత్త జీవిత ప్రయాణం సంతోషం, ప్రేమ, ఆశీర్వాదాలతో నిండిపోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.” అని కేటీఆర్ పోస్ట్ చేశారు. కేటీఆర్ పెద్ద మనసుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఓ యువతికి కేటీఆర్ పెద్దన్నగా నిలబడడం హర్షణీయమని పలువురు కొనియాడుతున్నారు. కేటీఆర్ ప్రతీ రాజకీయ నాయకుడిలా ఆలోచించాలని సూచిస్తున్నారు.