KTR: బీజేపీ టార్గెట్‌గా కేటీఆర్ సెటైర్లు.. ఎన్డీయే కూటమిపై ట్వీట్లు..
KTR: అవకాశం దొరికిన ప్రతిసారీ BJPపైన, ప్రధాని మోదీపైన ట్వీట్లతో ఎటాక్ చేస్తున్న మంత్రి కేటీఆర్ మరోసారి సెటైర్లు వేశారు.;
KTR: అవకాశం దొరికిన ప్రతిసారీ BJPపైన, ప్రధాని మోదీపైన ట్వీట్లతో ఎటాక్ చేస్తున్న మంత్రి కేటీఆర్ మరోసారి సెటైర్లు వేశారు. CBI, IT, ED కాకుండా NDAలో మిగిలిన పార్టీలేంటి..? అంటూ ప్రశ్నించారు. బిహార్ ముఖ్యమంత్రి నిన్ననే NDA నుంచి బయటకు వచ్చారు. CMగా రాజీనామా చేసి ఇప్పుడు మహాకూటమితో జతకట్టి మళ్లీ CMగా ప్రమాణం చేయబోతున్నారు.
ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ.. బీజేపీని టార్గెట్ చేశారు. ఈ మూడేళ్లలో ఎన్డీయేకి 3 పార్టీలు గుడ్‌బై చెప్పాయి. శివసేన, అకాలీదళ్ ఇప్పటికే దూరమవగా ఇప్పుడు జేడీయూ వంతు వచ్చింది. మిత్రపక్షాల్ని కూడా ఇరకాటంలోకి నెట్టే పాలిటిక్స్ చేస్తుండడం వల్లే BJPకి అంతా దూరమవుతున్నారని ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. ఈ పాయింట్ మీదే ఇప్పుడు కేటీఆర్ ట్వీట్ వైరల్ అవుతోంది.
So, after JD(U) exiting from NDA, how many alliance partners left?
— KTR (@KTRTRS) August 9, 2022
Other than CBI, IT & ED of course