KTR: అరెస్ట్ చేసుకుంటారా..చేసుకోండి: కేటీఆర్
తనకు అరెస్ట్ భయం లేదన్న కేటీఆర్... ఈ కార్ కేసులో నేను ఏ తప్పు చేయలేదు... లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమన్న కేటీఆర్
లగ్జరీ కార్ల విషయంలో తాను తప్పు చేస్తే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఫార్ములా ఈ రేస్ కేసులో తాను ఏ తప్పూ చేయలేదని అన్నారు. అవసరమైతే లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమని కీలక ప్రకటన చేశారు. అరెస్ట్ చేయాలనుకుంటే చేసుకోండి అని సవాల్ చేశారు. లగ్జరీ కార్ల కేసులోనూ విచారణకు సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు. తమ హయాంలో హైదరాబాద్ మెట్రోకు మంచి డిమాండ్ ఉండేదని, తాము దిగిపోయే నాటికి దేశంలోనే రెండో అతిపెద్ద వ్యవస్థగా ఉందని అన్నారు. అధికారంలోకి రాగానే రేవంత్‌రెడ్డి అనాలోచితంగా ఎయిర్‌పోర్టు మెట్రోను రద్దు చేశారు. ఆయన తలచుకుంటే ఇప్పటికే ఎయిర్‌పోర్టు మెట్రో పూర్తయ్యేది. భూసేకరణ ఇబ్బంది కూడా లేదు. ఎయిర్‌పోర్టు మెట్రో కొనసాగించాలని ఎల్ అండ్ టీ కోరింది. అందుకు రేవంత్‌రెడ్డి ఒప్పుకోలేదు. అప్పటి నుంచే సీఎం, ఎల్ అండ్ టీ మధ్య గొడవ మొదలైంది. రేవంత్ వైఖరి వల్లే ఆ సంస్థ వెళ్లిపోతోందని కేటీఆర్ విమర్శించారు. తన అరెస్టు కోసం కాంగ్రెస్ నేతలు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. తనను అరెస్టు చేసుకోండి... తనకు అరెస్టు భయం లేదని స్పష్టం చేశారు. తాను ఏ తప్పు చేయలేదని... ఏం చేసుకుంటారో చేసుకోవాలని సవాల్ విసిరారు. తనతో రేవంత్‌రెడ్డి లై డిటెక్టర్ టెస్ట్‌కు రావాలని ఛాలెంజ్ చేశారు. తనపై ఏసీబీ కేసు ఉందని... రేవంత్‌రెడ్డిపై కూడా ఏసీబీ కేసుందని గుర్తుచేశారు.
ప్రభుత్వానికి మాయని మచ్చ
గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ మెట్రోకు మంచి డిమాండ్ ఉండేదని, తాము దిగిపోయే నాటికి దేశంలోనే రెండో అతిపెద్ద వ్యవస్థగా ఉందని కేటీఆర్ అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడే ఎయిర్‌పోర్టు మెట్రోకు కూడా శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో వైఎస్ఆర్ ఓఆర్ఆర్ నిర్మించినప్పుడు ఒక మంచి పని చేశారని, రోడ్డు పక్కన కొంత భూమిని అదనంగా వదిలారని చెప్పారు. ‘‘అధికారంలోకి రాగానే రేవంత్‌రెడ్డి అనాలోచితంగా ఎయిర్‌పోర్టు మెట్రోను రద్దు చేశారు. ఆయన తలచుకుంటే ఇప్పటికే ఎయిర్‌పోర్టు మెట్రో పూర్తయ్యేది. భూసేకరణ ఇబ్బంది కూడా లేదు. ఎయిర్‌పోర్టు మెట్రో కొనసాగించాలని ఎల్ అండ్ టీ కోరింది. అందుకు రేవంత్‌రెడ్డి ఒప్పుకోలేదు. అప్పటి నుంచే సీఎం, ఎల్ అండ్ టీ మధ్య గొడవ మొదలైంది. రేవంత్ వైఖరి వల్లే ఆ సంస్థ వెళ్లిపోతోంది. ఎల్ అండ్ టీ నిష్క్రమణ రాష్ట్ర ప్రభుత్వానికి మాయని మచ్చ. పెట్టుబడిదారులను సాక్షాత్తూ ముఖ్యమంత్రే బెదిరిస్తున్నారు. నియంతలా వ్యవహరిస్తున్నారు’’ అని కేటీఆర్ విమర్శించారు.