వరదలో చిక్కుకున్న ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే వాహనం..!

హైదరాబాద్ జంట నగరాల్లో కురిసిన భారీ వర్షానికి.. నగరం అతలాకుతలమైంది. కుండపోత వానకు రహదారులన్నీ నీటమునిగాయి. కాలనీలు జలమయమయ్యాయి.;

Update: 2021-07-15 09:18 GMT

హైదరాబాద్ జంట నగరాల్లో కురిసిన భారీ వర్షానికి.. నగరం అతలాకుతలమైంది. కుండపోత వానకు రహదారులన్నీ నీటమునిగాయి. కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. మూసి పరివాహక ప్రాంతాల్లో డ్రైనేజీలు ఉప్పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలకు దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, కమలానగర్‌ ప్రాంతాల్లో కాలనీలు నీట మునిగాయి. అయితే ముప్పు ప్రాంతాల్లో పర్యటించేందుకు వెళ్ళిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి వాహనం వరదలో చిక్కుకుంది. ఆయన భద్రతా సిబ్బంది, స్థానికుల సహాయంతో కారును ముందుకు నెట్టడంతో వరద నీరు నుంచి కారు బయటకు వచ్చింది. వరద నీటిని బయటకు పంపించేందుకు సిబ్బంది పనిచేస్తున్నారని ఎమ్మెల్యే వెల్లడించారు. 



 


Tags:    

Similar News