MLC Kavitha: లిక్కర్ కేస్ లో విచారణకు వర్చువల్ గా హాజరైన కవిత..

తదుపరి విచారణ అక్టోబర్ 4 కు వాయిదా;

Update: 2024-09-25 05:45 GMT

 నేడు ఢిల్లీ కోర్టులో లిక్కర్ స్కామ్ కేసు విచారణ నేపథ్యంలో రౌస్ అవెన్యూ కోర్టులో లిక్కర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై విచారణ కొనసాగింది. ఈ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు ఇతర నిందితులు హాజరయ్యారు. కోర్టు విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కల్వకుంట్ల కవిత హాజరు అయ్యారు. గత విచారణ సందర్భంగా సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో ప్రతివాదులకు అందించిన కాపీలు క్లారిటీగా లేని పేపర్లను మళ్ళీ ఇవ్వాలని ట్రయల్ కోర్టు జడ్జి ఆదేశించారు.

ఇక నేడు జరిగిన రౌస్ అవెన్యూ కోర్టులో లిక్కర్ కేస్ లో సీబీఐ దాఖలు చేసిన చార్జి షీట్ పై విచారణ చేపట్టింది. విచారణకు వర్చువల్ గా ఎమ్మెల్సీ కవిత, మనీష్ సిసోడియా ఇతర లిక్కర్ కేసు నిందితులు హాజరయ్యారు. అయితే ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 4 కు వాయిదా పడింది. సీబిఐ ప్రతివాదులకు అందజేసిన ఛార్జ్ షీట్ ప్రతులు సరిగ్గా లేవని కోర్టుకు తెలిపారు న్యాయవాదులు. సరైన డాక్యుమెంట్స్ సప్లై చెయ్యాలని సీబిఐ కి రౌస్ అవెన్యూ కోర్ట్ జడ్జి కావేరి బవేజా ఆదేశాలు జారీ చేసారు. దాంతో తదుపరి విచారణను అక్టోబర్ 4 కు వాయిదా వేశారు ట్రయల్ కోర్టు జడ్జి కావేరి బవేజా.

Tags:    

Similar News