TG: ముందుగా సర్పంచ్ ఎన్నికలే

## డిసెంబర్‌ రెండో వారంలో స్థానిక ఎన్నికలు మొదట సర్పంచ్ ఎన్నికల నిర్వహణ.. సర్పంచ్ ఎన్నికల తర్వాతే జడ్పీటీసీ... 50% రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలు..

Update: 2025-11-18 02:30 GMT

జూ­బ్లీ­హి­ల్స్ ఉప ఎన్ని­క­లో కాం­గ్రె­స్ పా­ర్టీ ఘన వి­జ­యం సా­ధిం­చిం­ది. అదే స్ఫూ­ర్తి­తో స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల్లో­నూ వి­జ­య­బా­వుట ఎగు­ర­వే­యా­ల­ని రే­వం­త్ రె­డ్డి ప్ర­భు­త్వం వ్యూ­హా­త్మ­కం­గా అడు­గు­లు వే­స్తోం­ది. రే­వం­త్ రె­డ్డి అధ్య­క్ష­తన జరి­గిన కే­బి­నె­ట్ భే­టీ­లో స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల­పై కీలక ని­ర్ణ­యం తీ­సు­కు­న్నా­రు. తె­లం­గాణ ము­ఖ్య­మం­త్రి ఎ. రే­వం­త్ రె­డ్డి నే­తృ­త్వం­లో­ని కే­బి­నె­ట్ సమా­వే­శం­లో స్థా­నిక సం­స్థల ఎన్ని­కల షె­డ్యూ­ల్‌­పై కీలక ని­ర్ణ­యా­లు తీ­సు­కు­న్నా­రు. డి­సెం­బ­ర్ రెం­డో వా­రం­లో పం­చా­య­తీ ఎన్ని­క­లు, పరి­ష­త్ ఎన్ని­క­లు ఆ తర్వాత ము­న్సి­పా­లి­టీ ఎన్ని­క­లు ని­ర్వ­హిం­చా­ల­ని ని­ర్ణ­యిం­చా­రు. దీ­ని­కి కా­ర­ణం.. డి­సెం­బ­ర్ 1 నుం­చి 9 వరకు రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా ప్ర­జా­పా­లన వా­రో­త్స­వా­లు జర­గ­ను­న్నా­యి.  . 42% BC కోటా వి­ష­యం­లో కో­ర్టు స్టే ఉన్న­ప్ప­టి­కీ, పా­ర్టీ వా­రీ­గా రి­జ­ర్వే­ష­న్లు అమలు చేసి ఎన్ని­క­లు జర­పా­ల­ని కూడా చర్చిం­చా­రు. తదు­ప­రి న్యా­య­పో­రా­టం తర్వాత ని­ర్ణ­యం తీ­సు­కుం­టా­రు. 

ముందు సర్పంచ్ ఎన్నికలే..

తొ­లుత సర్పం­చ్ ఎన్ని­క­ల­కు వె­ళ్లా­ల­ని.. ఆ తర్వాత ఎం­పీ­టీ­సీ, జడ్పీ­టీ­సీ ఎన్ని­క­ల­కు వె­ళ్లా­ల­ని ని­ర్ణ­యిం­చా­రు. ముం­దు­గా గ్రామ పం­చా­య­తీ ఎన్ని­కల ఏర్పా­ట్ల­కు ఆదే­శా­లు ఇవ్వా­ల­ని ఈ భే­టీ­లో ని­ర్ణ­యిం­చా­రు. అలా­గే 50 శాతం రి­జ­ర్వే­ష­న్లు మిం­చ­కుం­డా ఎన్ని­క­ల­కు వె­ళ్లా­ల­ని ని­ర్ణ­యం తీ­సు­కు­న్నా­రు. 

పది రోజుల్లో నోటిఫికేషన్

మరో వారం, పది రో­జు­ల్లో ఈ పం­చా­య­తీ ఎన్ని­కల నో­టి­ఫి­కే­ష­న్ వి­డు­దల చే­సేం­దు­కు ప్ర­భు­త్వం కస­ర­త్తు చే­స్తోం­ది. డి­సెం­బ­ర్ 8, 9 తే­దీ­ల్లో తె­లం­గాణ రై­జిం­గ్ గ్లో­బ­ల్ సమ్మి­ట్ ని­ర్వ­హిం­చా­ల­ని కే­బి­నె­ట్ ని­ర్ణ­యిం­చిం­ది. ఆ తర్వాత ఎన్ని­క­ల­కు వె­ళ్ల­ను­న్నా­రు. సు­మా­రు ఆరు గంటల పాటు సా­గిన భే­టీ­లో కీలక ని­ర్ణ­యా­లు తీ­సు­కు­న్నా­రు. ఈ సం­ద­ర్భం­గా మం­త్రి పొం­గు­లే­టి శ్రీ­ని­వాస రె­డ్డి మీ­డి­యా­తో మా­ట్లా­డా­రు. బీ­సీ­ల­కు 42 శాతం రి­జ­ర్వే­ష­న్లు ఇవ్వా­ల­ని చి­త్త­శు­ద్ధి­తో భా­విం­చాం.. రా­ష్ట్ర­ప­తి దగ్గర బీసీ రి­జ­ర్వే­ష­న్ బి­ల్లు ఆగి­పో­యిం­ద­ని అన్నా­రు. రా­ష్ట్రం­లో మొదట సర్పం­చ్ ఎన్ని­క­లు ని­ర్వ­హి­స్తా­మ­ని స్ప­ష్టత ఇచ్చా­రు. పా­ర్టీ­ప­రం­గా బీ­సీ­ల­కు 42 శాతం రి­జ­ర్వే­ష­న్లు కల్పి­స్తా­మ­ని తె­లి­పా­రు. మి­గి­లిన జె­డ్పీ­టీ­సీ, ఎం­పీ­టీ­సీ, ము­న్సి­ప­ల్ కా­ర్పొ­రే­ష­న్ ఎన్ని­క­లు అన్ని కూడా కో­ర్టు తీ­ర్పు తర్వాత ని­ర్వ­హి­స్తా­మ­ని అన్నా­రు. గిగ్ వర్క­ర్ల బి­ల్లు­కూ కే­బి­నె­ట్ ఆమో­దం తె­లి­పి­న­ట్లు పే­ర్కొ­న్నా­రు. పా­ఠ్య పు­స్త­కా­ల్లో అం­దె­శ్రీ గే­యా­న్ని చే­ర్చా­ల్సిన ని­ర్ణ­యిం­చి­న­ట్లు తె­లి­పా­రు.

మరికొన్ని కీలక నిర్ణయాలు

ఈ సమా­వే­శం­లో గిగ్ వర్క­ర్ల బి­ల్లు­కూ కే­బి­నె­ట్ ఆమో­దం తె­లి­పిం­ది. అలా­గే స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల­పై ఈ భే­టీ­లో సు­దీ­ర్ఘం­గా చర్చిం­చా­రు. 50% రి­జ­ర్వే­ష­న్ల­కు లో­బ­డి ఎన్ని­క­ల­కు వె­ళ్లా­ల­ని ఈ సమా­వే­శం­లో ని­ర్ణ­యం తీ­సు­కు­న్న­ట్లు తె­లు­స్తోం­ది. ఓఆ­ర్‌­ఆ­ర్‌ లోపల ఉన్న పరి­శ్ర­మ­ల­ను బయ­టి­కి తర­లిం­చా­ల­ని గతం­లో­నే నో­టీ­సు­లు ఇచ్చాం. ఆ భూ­ము­ల­ను ‘మల్టీ యూ­జ్‌ జో­న్లు’గా వి­ని­యో­గిం­చు­కో­వా­ల­ని ని­ర్ణ­యిం­చాం. వా­టి­కి ఎదు­రు­గా ఉన్న రో­డ్డు వె­డ­ల్పు­ను బట్టి రా­ష్ట్ర ప్ర­భు­త్వా­ని­కి రు­సుం కట్టా­లి. ఇం­దు­కో­సం హై­ద­రా­బా­ద్‌ ఇం­డ­స్ట్రి­య­ల్‌ ల్యాం­డ్స్‌ ట్రా­న్స్‌­ఫ­ర్మే­ష­న్‌ పా­ల­సీ­కి క్యా­బి­నె­ట్‌ ఆమో­దం తె­లి­పిం­ది. తె­లం­గాణ సా­ధిం­చు­కు­న్న పదే­ళ్ల­లో రా­ష్ట్రా­ని­కి ప్ర­త్యేక అధి­కా­రిక గీతం లే­క­పో­తే.. అం­దె­శ్రీ రా­సిన ‘జయ జయహే తె­లం­గాణ’ను రా­ష్ట్ర గీ­తం­గా ప్ర­క­టిం­చు­కు­న్నాం. ఆ రు­ణా­న్ని ఉడ­తా­భ­క్తి­గా తీ­ర్చు­కో­వా­ల­ని ఆయన కు­మా­రు­డు దత్త­సా­యి­కి డి­గ్రీ కా­లే­జీ అసి­స్టెం­ట్‌ ప్రొ­ఫె­స­ర్‌­గా ఉద్యో­గం ఇవ్వా­ల­ని క్యా­బి­నె­ట్‌ తీ­ర్మా­నిం­చిం­ది. ‘జయ జయహే తె­లం­గాణ’ గీ­తా­న్ని ప్ర­తి పా­ఠ్య­పు­స్త­కం మొ­ద­టి పే­జీ­లో ము­ద్రిం­చా­ల­ని ని­ర్ణ­యిం­చాం. తె­లం­గాణ ఉద్య­మం­లో అం­దె­శ్రీ పా­త్ర గు­రిం­చి భా­వి­త­రా­ల­కు తె­లి­య­జే­సే­లా.. రా­ష్ట్రం­లో అం­దె­శ్రీ స్మృ­తి­వ­నం ఏర్పా­టు­కు ని­ర్ణ­యిం­చాం. డి­సెం­బ­రు 7 నా­టి­కి ప్ర­జా ప్ర­భు­త్వం ఏర్ప­డి రెం­డే­ళ్లు పూ­ర్తి కా­వ­స్తోం­ది. ఈ సం­ద­ర్భం­గా ఫ్యూ­చ­ర్‌ సి­టీ­లో డి­సెం­బ­రు 8, 9 తే­దీ­ల్లో ‘తె­లం­గాణ రై­జిం­గ్‌ గ్లో­బ­ల్‌ సమి­ట్‌-2047’ ఏర్పా­టు చే­యా­ల­ని ని­ర్ణ­యిం­చా­రు.

Tags:    

Similar News