లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ : మద్యం దుకాణాల వద్ద బారులు తీరిన మందుబాబులు

కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో మందుబాబులు అలెర్ట్ అయ్యారు. మద్యం దుకాణాల వద్ద బారులు తీరారు.

Update: 2021-05-11 10:43 GMT

కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో మందుబాబులు అలెర్ట్ అయ్యారు. మద్యం దుకాణాల వద్ద బారులు తీరారు. ఒక్కసారిగా లాక్ డౌన్ ప్రకటన వేలువడడంతో మద్యం దుకాణాల వద్ద మందుబాబు క్యూ కట్టారు. కరోనాను పట్టించుకోకుండా, సామజీక దూరం పాటించకుండా ఒకరిపైన ఒకరు తోసుకుంటూ క్యూ లైన్ లో నిలబడ్డారు. దాదాపు పదిరోజులకి సరిపడా మందును తీసుకెళ్తున్నారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో దాదాపుగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. దుకాణాల ఎదుట రద్దీని నియంత్రించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. 

Tags:    

Similar News