పెళ్లి విషయంలో మనస్పర్ధలు.. ప్రేమ జంట ఆత్మహత్య
పెళ్లి విషయంలో మనస్పర్ధలు రావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.;
నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నందిపేట్ మండలంలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లి విషయంలో మనస్పర్ధలు రావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతులు కుద్వాన్‌పూర్‌కు చెందిన సుకన్య, ఐలాపూర్‌కు చెందిన ప్రేమ్‌గా గుర్తించారు. సుకన్య ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ్ ఐలాపూర్ చెరువు సమీపంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.