తెలంగాణ యువతి ప్రతిభ.. తక్కువ ఖర్చుతో ఇంటి నిర్మాణం.. 200 ఇళ్లకు ఆర్డర్
చాలామంది పూరి గుడిసెలు, రేకుల షెడ్డులు వేసుకుని తాత్కాలిక గృహాలలో నివసిస్తున్నారు.;
2019 లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం భారతదేశం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటి అని సూచించింది. అదే అధ్యయనం ప్రకారం 63 మిలియన్ల మందికి పైగా ప్రజలకు తగిన గృహ వసతి లేదు.
చాలామంది పూరి గుడిసెలు, రేకుల షెడ్డులు వేసుకుని తాత్కాలిక గృహాలలో నివసిస్తున్నారు. , మరికొందరు వాతావరణ పరిస్థితులకు అనువుగా లేని వాటిని నిర్మించుకుంటున్నారు. చలికి, వర్షానికి తట్టుకోలేక ఇళ్లను నిరంతరం మారుస్తుంటారు.
ఈ సమస్యను పరిష్కరించడానికి, తెలంగాణలోని బొమ్మకల్ గ్రామంలో నివసిస్తున్న పేరాలా మానసా రెడ్డి (23) పూనుకున్నారు. హాంకాంగ్ లో ఇలాంటి ఇళ్ల నిర్మాణం చేపట్టి అందరికీ గృహ వసతి కలిపిస్తున్న విషయం ఆమెను ఆకట్టుకుంది. ' ఓపాడ్ ట్యూబ్ హౌసెస్ ' అనేది తక్కువ ఖర్చుతో కూడిన గృహ పరిష్కారం. దీనిని మొదట హాంకాంగ్‌లోని జేమ్స్ లా సైబర్‌టెక్చర్ రూపొందించారు.
తెలంగాణలోని ఒక తయారీదారు నుండి పైపులు సేకరించింది. వృత్తాకార పైపులు అయినప్పటికీ, ముగ్గురు ఉన్న కుటుంబానికి అనుకూలంగా ఉంటాయి.
వినియోగదారుల అవసరాలను బట్టి 1BHK, 2BHK లేదా 3BHK గా నిర్మించవచ్చు "అని పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (LPU) నుండి సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన మానస చెప్పింది. ఈ నిర్మాణాన్ని 15 నుండి 20 రోజుల్లో నిర్మించవచ్చు.
ఆమె సామ్నావి కన్స్ట్రక్షన్స్ అనే స్టార్టప్‌ను కూడా ప్రారంభించింది. దేశవ్యాప్తంగా తక్కువ ఖర్చుతో కూడిన గృహాలను నిర్మించాలని భావిస్తోంది.
బొమ్మకల్ అనే చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన మానస తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీలో పాఠశాల విద్యను పూర్తి చేసింది. హైస్కూల్ విద్య పూర్తి చేసిన తరువాత ఆమె ఎల్పీయూలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది.
జపాన్, హాంకాంగ్ లలో కనిపించే తక్కువ ధర గృహ నిర్మాణ ఎంపికలపై నెలల తరబడి పరిశోధన చేసిన తరువాత ఈ తరహా ఇళ్లను రూపొందించాలని నిర్ణయించుకుంది. తక్కువ స్థలంలో తక్కువ ఖర్చుతో కూడిన గృహాలను నిర్మించడం గురించి ఆన్‌లైన్‌లో అనేక పరిశోధనా పత్రాలను కూడా చదివింది.
2020 చివరి నాటికి, COVID-19 లాక్‌డౌన్ సడలించిన తర్వాత, మానస తెలంగాణలోని సిద్దిపేటలో మురుగునీటి పైపుల తయారీదారుని సంప్రదించింది. వారి సహాయంతో, ఆమె ఒక పొడవైన పైపును సేకరించింది.
తలుపు, కిటికీ ఫ్రేమ్‌తో పాటు బాత్రూమ్, ఎలక్ట్రికల్ ఫిట్టింగులతో సహా పైపు ఇతర ముడి పదార్థాలను కొనుగోలు చేయడానికి మానస తన తల్లి నుండి రూ .5 లక్షలు అప్పు తీసుకుంది.
"నేను మూడవ తరగతిలో ఉన్నప్పుడు నాన్న మరణించారు. తండ్రి చనిపోయిన అదే సంవత్సరంలో ఆమె వరి సాగును చేపట్టింది. నా ప్రాజెక్టుకి ఆమె పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది.
2021 మార్చి 2 న మానసకు ఆమె బంధువు అందించిన ప్లాట్ వద్ద నిర్మాణం ప్రారంభించింది. మార్చి 28 నాటికి, సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ని సిద్ధం చేసింది.
"ఇల్లు 16 అడుగుల పొడవు, 7 అడుగుల పొడవు ఉంటుంది. ఇది ఒక చిన్న గది, బాత్రూమ్, కిచెన్ ,సింక్ ఉంది "అని మానస చెప్పారు.
మానస తన సంస్థ సామ్నావి కన్స్ట్రక్షన్స్ ను ఎల్.పి.యులో కలిసి చదువుకున్న బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థి నవీన్ రెడ్డితో కలిసి ప్రారంభించింది.
ఈ గృహాలను నిర్మించాలని కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశాతో సహా వివిధ రాష్ట్రాల నుంచి ఇప్పటివరకు ఆమెకు 200 కి పైగా ఆర్డర్లు వచ్చాయి. లాక్డౌన్ మరియు COVID-19 పరిమితుల కారణంగా, ఆమె ఇంకా వీటిని ప్రారంభించలేదు.