CHAIRMEN: లక్కీ డ్రాలో తొర్రూరు, జనగామ కాంగ్రెస్ కైవసం!

తీవ్ర ఉత్కంఠ రేపిన చైర్మన్ ఎన్నిక

Update: 2026-02-17 08:30 GMT

జన­గామ ము­న్సి­ప­ల్‌ చై­ర్మ­న్‌ ఎన్నిక ఉత్కం­ఠ­భ­రి­తం­గా సాగి చి­వ­రి­కి లక్కీ డ్రా­తో ము­గి­సిం­ది. కాం­గ్రె­స్‌, బీ­ఆ­ర్ఎ­స్‌ పా­ర్టీ­ల­కు సమా­నం­గా ఓట్లు రా­వ­డం­తో ని­బం­ధ­నల ప్ర­కా­రం అధి­కా­రు­లు లా­ట­రీ ని­ర్వ­హిం­చ­గా, కాం­గ్రె­స్‌ అభ్య­ర్థి కద­కం­చి బా­ల­మ­ణి అదృ­ష్టం వరిం­చిం­ది. దీం­తో జన­గామ ము­న్సి­పా­లి­టీ కాం­గ్రె­స్‌ ఖా­తా­లో­కి వె­ళ్లిం­ది. జన­గామ ము­న్సి­పా­లి­టీ­లో మొ­త్తం 30 వా­ర్డు­లు ఉన్నా­యి. వీ­టి­లో బీ­ఆ­ర్ఎ­స్‌ 13 వా­ర్డు­లు గె­లు­చు­కో­గా, ఇద్ద­రు స్వ­తం­త్రు­లు మద్ద­తు ఇచ్చా­రు. ఆ పా­ర్టీ ఎమ్మె­ల్యే పల్లా రా­జే­శ్వ­ర్‌­రె­డ్డి ఎక్స్‌­అ­ఫీ­షి­యో ఓటు­తో కలి­పి బీ­ఆ­ర్ఎ­స్‌ బలం 16కు చే­రిం­ది. మరో­వై­పు కాం­గ్రె­స్‌ పా­ర్టీ 12 వా­ర్డు­లు గె­లు­చు­కు­ని, మి­త్ర­ప­క్షం సీ­పీ­ఎం ఒక వా­ర్డు సా­ధిం­చిం­ది. ఇద్ద­రు స్వ­తం­త్రుల మద్ద­తు­తో పాటు భు­వ­న­గి­రి ఎంపీ కి­ర­ణ్‌­కు­మా­ర్‌­రె­డ్డి ఎక్స్‌­అ­ఫీ­షి­యో ఓటు కలి­పి కాం­గ్రె­స్‌ బలం కూడా 16కు చే­రిం­ది. దీం­తో ఇరు పా­ర్టీల మధ్య సమాన పరి­స్థి­తి నె­ల­కొం­ది.

చై­ర్మ­న్‌, వై­స్‌ చై­ర్మ­న్‌ ఎన్ని­క­లో కాం­గ్రె­స్‌ తర­ఫున బా­ల­మ­ణి, బీ­ఆ­ర్ఎ­స్‌ తర­ఫున గంజి రా­జ­మ­ణి పోటీ పడ్డా­రు. ఓట్ల లె­క్కిం­పు­లో ఇద్ద­రి­కీ 16 చొ­ప్పున రా­వ­డం­తో అధి­కా­రు­లు లక్కీ డ్రా ని­ర్వ­హిం­చా­రు. ఇద్ద­రి పే­ర్లు చీ­ట్ల­లో వేసి డ్రా తీ­స­గా కాం­గ్రె­స్‌ అభ్య­ర్థి బా­ల­మ­ణి వి­జే­త­గా ప్ర­క­టిం­చా­రు. ఫలి­తా­న్ని ప్ర­క­టిం­చ­గా­నే కాం­గ్రె­స్‌ శ్రే­ణు­లు సం­బ­రా­ల్లో ము­ని­గి­పో­యా­యి. బీ­ఆ­ర్ఎ­స్‌ నే­త­లు ని­ర­స­న­కు ది­గు­తూ ము­న్సి­ప­ల్‌ కా­ర్యా­ల­యం ఎదుట ఆం­దో­ళన చే­ప­ట్టా­రు. పో­లీ­సు­లు తీ­రు­పై అభ్యం­త­రం వ్య­క్తం చే­శా­రు. వరం­గ­ల్‌ జి­ల్లా­లో­ని తొ­ర్రూ­రు ము­న్సి­పా­లి­టీ­లో కూడా ఇదే పరి­స్థి­తి నె­ల­కొం­ది. మొ­త్తం 16 వా­ర్డు­ల్లో బీ­ఆ­ర్ఎ­స్‌ 9, కాం­గ్రె­స్‌ 7 గె­లు­చు­కు­న్నా­యి. అయి­తే పా­ల­కు­ర్తి ఎమ్మె­ల్యే యశ­స్వి­ని­రె­డ్డి, వరం­గ­ల్‌ ఎంపీ కడి­యం కా­వ్యల ఎక్స్‌­అ­ఫీ­షి­యో ఓట్ల­తో కాం­గ్రె­స్‌ బలం 9కు చేరి ఇరు పా­ర్టీల సం­ఖ్య సమా­న­మైం­ది. దీం­తో అక్కడ కూడా లా­ట­రీ ద్వా­రా చై­ర్మ­న్‌­ను ఎం­పిక చే­యా­ల్సి వచ్చిం­ది. డ్రా­లో కాం­గ్రె­స్‌ అభ్య­ర్థి వి­జ­యం సా­ధిం­చ­డం­తో తొ­ర్రూ­రు ము­న్సి­పా­లి­టీ కూడా కాం­గ్రె­స్‌ వశ­మైం­ది. తీ­వ్ర ఉత్కంఠ నడుమ జరి­గిన జన­గామ, తొ­ర్రూ­రు ము­న్సి­ప­ల్‌ చై­ర్మ­న్‌ ఎన్ని­క­ల్లో లక్కీ డ్రా కాం­గ్రె­స్‌­కు అను­కూ­లం­గా మా­రిం­ది.

Tags:    

Similar News