MEDARAM: మురికి కూపంలా మారిన "మేడారం"

మహాజాతర ముగింపుతో పేరుకుపోయిన వ్యర్థాలు.. 3 వేల టన్నుల చెత్త పోగైనట్లు అధికారుల అంచనా... శుభ్రం చేసేందుకు 6 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు

Update: 2026-02-08 09:00 GMT

ఆసి­యా­లో­నే అతి­పె­ద్ద గి­రి­జన జాతర, తె­లం­గాణ కుం­భ­మే­ళా­గా పే­రు­గాం­చిన మే­డా­రం సమ్మ­క్క-సా­ర­ల­మ్మ మహా­జా­తర ము­గి­సిం­ది. లక్ష­లా­ది మంది భక్తుల రా­క­తో నెల రో­జు­లు­గా కి­క్కి­రి­సి­పో­యిన మే­డా­రం పరి­స­రా­లు.. జాతర ము­గి­సిన అనం­త­రం భా­రీ­గా పే­రు­కు­పో­యిన వ్య­ర్థా­ల­తో నిం­డి­పో­యా­యి. భక్తు­లు క్షే­మం­గా తమ గమ్య­స్థా­నా­ల­కు చే­రు­కు­న్న­ప్ప­టి­కీ.. వారు వది­లి వె­ళ్లిన టన్నుల కొ­ద్దీ చె­త్త­ను శు­భ్రం చే­య­డం ఇప్పు­డు అధి­కా­రు­ల­కు, పా­రి­శు­ధ్య సి­బ్బం­ది­కి పె­ద్ద సవా­ల్‌­గా మా­రిం­ది. జంతు, కో­ళ్ల వ్య­ర్థా­లు కు­ళ్లి­పో­వ­డం­తో ఆ ప్రాం­త­మం­తా తీ­వ్ర దు­ర్గం­ధం వె­ద­జ­ల్లు­తోం­ది. పరి­స్థి­తి­ని అదు­పు­లో­కి తీ­సు­కొ­చ్చేం­దు­కు అధి­కా­రు­లు ప్ర­త్యేక కా­ర్యా­చ­రణ రూ­పొం­దిం­చి, పె­ద్ద సం­ఖ్య­లో పా­రి­శు­ద్ధ్య సి­బ్బం­ది­తో శు­భ్ర­ప­రి­చే పను­ల­ను వే­గ­వం­తం చే­స్తు­న్నా­రు. ఈ శు­భ్ర­తా పను­ల్లో ఉన్న కా­ర్మి­కు­లు తీ­వ్ర అస­హ­నం వ్య­క్తం చే­స్తు­న్నా­రు. సా­ధా­రణ క్లీ­నిం­గ్ అని చె­ప్పి తీ­సు­కొ­చ్చా­ర­ని, కానీ జంతు అవ­శే­షా­లు, కో­ళ్ల వ్య­ర్థా­ల­తో కూ­డిన అత్యంత దు­ర్భర పరి­స్థి­తు­ల్లో పని­చే­యా­ల్సి వస్తోం­ద­ని వారు వేదన వ్య­క్తం చే­స్తు­న్నా­రు. అమ్మ­వా­రి కృ­ప­తో­నే ఈ పని­ని భరి­స్తు­న్నా­మ­ని చె­బు­తూ భా­వో­ద్వే­గా­ని­కి లో­న­వు­తు­న్నా­రు. వ్య­ర్థా­ల్లో దా­దా­పు 48 శాతం ప్లా­స్టి­క్, గాజు సీ­సాల వం­టి­వి ఉం­డ­టం ఆం­దో­ళన కలి­గి­స్తోం­ది. మే­డా­రం­తో పాటు కన్నె­ప­ల్లి, నా­ర్లా­పూ­ర్, కొం­గల గట్టు వంటి ప్రాం­తా­ల్లో దా­దా­పు 3 వేల టన్నుల చె­త్త పే­రు­కు­పో­యి­న­ట్లు అధి­కా­రు­లు అం­చ­నా వే­స్తు­న్నా­రు.

కార్మికుల ఆవేదన

పను­ల్లో పా­ల్గొం­టు­న్న కా­ర్మి­కు­లు తీ­వ్ర ఆవే­దన వ్య­క్తం చే­స్తు­న్నా­రు. "రో­డ్లు, ప్లా­స్టి­క్ క్లీ­నిం­గ్ అని చె­ప్పి ఇక్క­డి­కి తీ­సు­కొ­చ్చా­రు. కానీ ఇక్కడ జం­తు­వుల తో­ళ్లు, తల­కా­య­లు, కో­ళ్ల వ్య­ర్థా­లు గు­ట్ట­లు­గా పడి ఉన్నా­యి. వా­టి­ని చూ­స్తుం­టే­నే వాం­తు­లు వస్తు­న్నా­యి. ఇంత గలీ­జు పని మే­మె­ప్పు­డూ చే­య­లే­దు" అని కొం­ద­రు వా­పో­యా­రు. అమ్మ­వా­ర్ల దయ­తో­నే ఈ పని చే­స్తు­న్నాం అని కన్నీ­టి­ప­ర్యం­త­మ­య్యా­రు. జా­త­ర­ వ్య­ర్థా­ల్లో దా­దా­పు 48 శాతం ప్లా­స్టి­క్, గాజు సీ­సాల వం­టి­వి ఉం­డ­టం ఆం­దో­ళన కలి­గి­స్తోం­ది. సు­మా­రు 100 టన్నుల ఖాళీ బా­టి­ళ్ల­లో చాలా వరకు పగి­లి­పో­యి ప్ర­మా­ద­క­రం­గా మా­రా­యి. మి­గి­లిన 52 శాతం బి­య్యం, బె­ల్లం వం­టి­వి భూ­మి­లో కలి­సి­పో­యే­వి­గా ఉన్నా­యి. ప్ర­స్తు­తం ఈ వ్య­ర్థా­ల­ను వేరు చేసి, మే­డా­రం ప్రాం­గ­ణా­న్ని శు­భ్ర­ప­రి­చే పను­లు ము­మ్మ­రం­గా కొ­న­సా­గు­తు­న్నా­యి. వ్య­ర్థాల వర్గీ­క­రణ, ప్లా­స్టి­క్ ము­ప్పు జా­త­ర­లో పో­గైన వ్య­ర్థా­ల్లో సు­మా­రు 48 శాతం వరకు ప్లా­స్టి­క్, గాజు వంటి భూ­మి­లో కలి­సి­పో­ని వస్తు­వు­లు ఉం­డ­టం ఆం­దో­ళన కలి­గి­స్తోం­ది. వీ­టి­లో సు­మా­రు 100 టన్ను­ల­కు పైగా కే­వ­లం ఖాళీ బా­టి­ళ్ల వ్య­ర్థా­లే ఉన్న­ట్లు గు­ర్తిం­చా­రు.

Tags:    

Similar News