MESSI: నేడు హైదరాబాద్‌కు ది గోట్ మెస్సీ

మెస్సీ పూర్తి షెడ్యూల్ ఇదే

Update: 2025-12-13 05:30 GMT

ఫు­ట్‌­బా­ల్‌ ది­గ్గ­జం.. అర్జెం­టీ­నా­కు చెం­దిన లి­యో­నె­ల్‌ మె­స్సీ.. ది గో­ట్‌ ఇం­డి­యా టూ­ర్‌-2025లో భా­గం­గా హై­ద­రా­బా­ద్‌ వస్తు­న్నా­రు. నేడు హై­ద­రా­బా­ద్‌ వస్తు­న్న మె­స్సీ.. ఉప్ప­ల్‌ స్టే­డి­యం­లో ఆ రోజు ని­ర్వ­హి­స్తు­న్న ఫ్రెం­డ్లీ ఫు­ట్‌­బా­ల్‌ మ్యా­చ్‌­లో ము­ఖ్య­మం­త్రి రే­వం­త్‌ రె­డ్డి­తో తల­ప­డ­ను­న్నా­రు. మె­స్సీ హై­ద­రా­బా­ద్‌ పర్య­ట­న­కు సం­బం­ధిం­చిన వి­వ­రా­ల­ను ఆ టూ­ర్‌ ప్ర­మో­ట­ర్‌ పా­ర్వ­తి­రె­డ్డి బు­ధ­వా­రం వి­లే­క­రు­ల­కు వె­ల్ల­డిం­చా­రు. మె­స్సీ హై­ద­రా­బా­ద్‌­కు వస్తు­న్న సం­ద­ర్భం­గా ఉప్ప­ల్‌ స్టే­డి­యం­లో 13వ తే­దీన సిం­గ­రే­ణి ఆర్‌­ఆ­ర్‌-9, అప­ర్ణ జట్ల మధ్య ఫ్రెం­డ్లీ ఫు­ట్‌­బా­ల్‌ మ్యా­చ్‌ ఉం­టుం­ద­న్నా­రు. ఇం­దు­లో సిం­గ­రే­ణి జట్టు తర­ఫున రే­వం­త్‌ రె­డ్డి, అప­ర్ణ జట్టు తర­ఫున మె­స్సీ ఆడు­తు­న్నా­ర­ని వె­ల్ల­డిం­చా­రు.

ఫు­ట్‌­బా­ల్ ది­గ్గ­జం లి­యో­నె­ల్ మె­స్సీ హై­ద­రా­బా­ద్ పర్య­ట­న­కు సం­బం­ధిం­చిన పూ­ర్తి వి­వ­రా­లు బయ­ట­కు వచ్చా­యి. షె­డ్యూ­ల్ లో భా­గం­గా నేడు మధ్యా­హ్నం 3 నుం­డి 4 గంటల మధ్య కో­ల్‌­క­తా నుం­చి శం­షా­బా­ద్ ఎయి­ర్‌­పో­ర్ట్‌­కు చే­రు­కో­ను­న్నా­రు. శం­షా­బా­ద్ చే­రు­కు­న్న వెం­ట­నే మె­స్సీ నే­రు­గా తాజ్ ఫల­క్‌­ను­మా ప్యా­లె­స్‌­కు వె­ళ్ల­ను­న్నా­రు. అక్కడ గం­ట­పా­టు అభి­మా­ను­ల­తో ప్ర­త్యే­క­మైన మీట్ అండ్ గ్రీ­ట్ కా­ర్య­క్ర­మం ఏర్పా­టు చే­శా­రు. మె­స్సీ­తో ఫోటో ది­గేం­దు­కు 10 లక్షల రూ­పా­య­లు చె­ల్లిం­చి ముం­దు­గా­నే స్లా­ట్లు బుక్ చే­సు­కు­న్న 100 మంది అదృ­ష్ట­వం­తు­ల­తో స్టా­ర్ ప్లే­య­ర్ ము­ఖా­ము­ఖీ­గా మా­ట్లా­డి, ఫో­టో­లు ది­గ­ను­న్నా­డు.

సా­యం­త్రం 6 గం­ట­ల­కు మె­స్సీ ఉప్ప­ల్ స్టే­డి­యం­కు చే­రు­కుం­టా­రు. అక్కడ చి­న్నా­రుల ఫు­ట్‌­బా­ల్ జట్టు­తో 15 ని­మి­షా­ల­పా­టు సం­భా­షిం­చి, కొ­న్ని ఫు­ట్‌­బా­ల్ మె­ళ­కు­వ­లు తె­ల­ప­ను­న్నా­డు. ఆపై సా­యం­త్రం 7 గం­ట­ల­కు ప్ర­ధాన ఈవెం­ట్ ప్రా­రం­భం కా­నుం­ది. ఇం­దు­లో సం­గీత కా­ర్య­క్ర­మం సహా పలు ఆక­ర్ష­ణ­లు ఉం­టా­యి. 7.30కి ప్ర­త్యేక మ్యా­చ్ జరు­గ­నుం­ది. సిం­గ­రే­ణి RR జట్టు­కు తె­లం­గాణ సీఎం రే­వం­త్ రె­డ్డి నా­య­క­త్వం వహి­స్తుం­డ­గా.. అప­ర్ణ మె­స్సీ టీమ్ తర­ఫున మె­స్సీ ఆడ­ను­న్నా­రు. మె­స్సీ­తో పాటు అతని స్నే­హి­తు­లైన రో­డ్రి­గో, లూ­యి­స్ సు­రే­జ్ కూడా ఈ మ్యా­చ్‌­లో పా­ల్గొ­న­బో­తు­న్నా­రు. అయి­తే మ్యా­చ్ చి­వ­రి ఐదు ని­మి­షా­ల్లో మా­త్ర­మే మె­స్సీ, సీఎం రే­వం­త్ రె­డ్డి గ్రౌం­డ్‌­లో­కి ప్ర­వే­శిం­చి ఆడ­ను­న్నా­రు. మ్యా­చ్ అనం­త­రం వి­జేత జట్టు­కు GOAT ట్రో­ఫీ­ని మె­స్సీ, రే­వం­త్ రె­డ్డి కలి­సి ప్ర­ధా­నం చే­య­ను­న్నా­రు. మరు­స­టి రోజు ఉదయం ముం­బై­కి పయ­న­మ­వు­తా­రు.

మ్యాచ్ కోసం ముస్తాబైన ఉప్పల్ స్టేడియం

ఫు­ట్‌­బా­ల్ ది­గ్గ­జం లి­యో­నె­ల్ మె­స్సీ­తో సీఎం రే­వం­త్ రె­డ్డి ఆడ­బో­యే ఫ్రెం­డ్లీ ఫు­ట్‌­బా­ల్ మ్యా­చ్ కోసం ఉప్ప­ల్ స్టే­డి­యం ము­స్తా­బైం­ది. ఇప్ప­టి­కే రా­జీ­వ్ గాం­ధీ ఇం­ట­ర్నే­ష­న­ల్ స్టే­డి­యం ఉప్ప­ల్‌­లో అధి­కా­రు­లు అన్ని ఏర్పా­ట్లు పూ­ర్తి చే­శా­రు. భారీ భద్రత నడుమ ఈ మ్యా­చ్ జర­గ­నుం­ది. మె­స్సీ­కి జెడ్ ప్ల­స్ సె­క్యూ­రి­టీ, 3,500 మంది పో­లీ­సు­ల­తో భద్ర­తా ఏర్పా­ట్లు చే­శా­రు. ఈ ఈవెం­ట్ కోసం స్టే­డి­యం అధి­కా­రు­లు మొ­త్తం రూ.50 లక్ష­లు ఖర్చు చే­స్తు­న్న­ట్లు అధి­కా­రు­లు తె­లి­పా­రు. స్టే­డి­యం మౌ­లిక వస­తుల పు­న­రు­ద్ధ­ర­ణ­లో భా­గం­గా, కు­ర్చీ­లు, లై­టిం­గ్, షె­డ్లు, బా­త్రూ­ము­లు మొ­ద­లైన వాటి మర­మ్మ­తు­లు చే­సి­న­ట్లు తె­లు­స్తోం­ది. ఈ RGI స్టే­డి­యం­లో 59 కా­ర్పొ­రే­ట్ బా­క్సుల సా­మ­ర్థ్యం­తో 38,000 మంది ప్రే­క్ష­కు­ల­ను ఆతి­థ్యం ఇవ్వ­గ­ల­దు.. ఈ స్టే­డి­యం ఇప్ప­టి­కే అనేక క్రి­కె­ట్ లీ­గ్‌­లు, మ్యా­చ్‌­లు కూడా ని­ర్వ­హిం­చిన వి­ష­యం తె­లి­సిం­దే. నేడు మధ్యా­హ్నం 3 నుం­డి 4 గంటల మధ్య కో­ల్‌­క­తా నుం­చి శం­షా­బా­ద్ ఎయి­ర్‌­పో­ర్ట్‌­కు చే­రు­కో­ను­న్నా­రు. అక్క­డి­నుం­చి గ్రీ­న్ ఛా­న­ల్ ద్వా­రా తాజ్ ఫల­క్‌­ను­మా ప్యా­లె­స్‌­కు వె­ళ్ల­ను­న్నా­రు. అక్కడ అభి­మా­ను­ల­తో మీట్ అండ్ గ్రీ­ట్ కా­ర్య­క్ర­మం­లో పా­ల్గొం­టా­రు. ఆ తర్వాత సా­యం­త్రం 6 గం­ట­ల­కు మె­స్సీ ఉప్ప­ల్ స్టే­డి­యా­ని­కి చే­రు­కుం­టా­రు

Tags:    

Similar News