Harish Rao : ఈటల తప్పుడు ఆరోపణలు చేస్తూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు..!
Harish Rao : హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి హరీష్‌రావు..;
Harish Rao : హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి హరీష్‌రావు.. రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ మీద 291 రూపాయలు ట్యాక్స్ వేస్తుందని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.. ఒక ఆర్థిక మంత్రిగా పని చేసిన వ్యక్తి కి రాష్ట్ర ప్రభుత్వ పన్ను లేదని తెలియదా అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ఈటల చేస్తున్న అబద్ధపు ప్రచారాలను హుజూరాబాద్ ప్రజలు నమ్మబోరని చెప్పారు హరీష్‌రావు. కాగా హుజురాబాద్ కు ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ ఎన్నికల బరిలో ఉన్నారు.