Minister KTR : కేంద్రాన్ని,మోడీని విమర్శిస్తే ఇబ్బందిపడేవారు నన్ను అన్ ఫాలో కావొచ్చు : కేటీఆర్ సూచన
Minister KTR : ట్విట్టర్ వేదికగా మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఎల్పీజీ సిలిండర్ ధరల పెంపు ఏప్రిల్ ఫూల్ తరహాలో జోక్ అయితే బాగుండేదన్నారు.;
Minister KTR : ట్విట్టర్ వేదికగా మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఎల్పీజీ సిలిండర్ ధరల పెంపు ఏప్రిల్ ఫూల్ తరహాలో జోక్ అయితే బాగుండేదన్నారు. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర 250 రూపాయలు పెరిగి 2 వేల 253 రూపాలయకు చేరడంతో సెటైర్ వేశారు. ఏప్రిల్ ఫూల్స్ డేను అచ్చే దిన్ దివస్‌గా పోల్చుతూ ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీని విమర్శిస్తూ పోస్టులు పెట్టిన ప్రతీసారి ఇబ్బంది పడేవారు తనను ఆన్ ఫాలో కావొచ్చని సూచించారు. కేంద్రం, బీజేపీ మత తత్వ విధానాలతో పాటు తప్పుడు ప్రచారాలను ఎప్పటికీ ఎండగడుతూనే ఉంటానన్నారు.