KTR : ప్రైవేటు ఆసుపత్రుల తీరుపై మంత్రి కేటీఆర్ సీరియస్...!

తెలంగాణలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది.

Update: 2021-05-28 11:15 GMT

తెలంగాణలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. ఫిర్యాదులు వచ్చిన ఆసుపత్రులకు వైద్యశాఖ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఇప్పటివరకు 88 షోకాజ్ నోటీసులు జారీ చేయగా.. 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని తెలిపింది. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య శాఖ హెచ్చరించింది. 1200 కి పైగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలు కొనసాగుతున్నాయి. అయితే ప్రైవేటు ఆసుపత్రిలలో అదనపు చార్జీలు సహా అనేక వాటిపై ప్రజల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కూకట్పల్లిలోని ఓ ఆస్పత్రిపై ఏకంగా ఆరు ఫిర్యాదులు వచ్చాయి. కరోనా లాంటి కష్టకాలంలో ఉన్న ప్రజల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేయడంపైన మంత్రి కేటీఆర్ కూడా సీరియస్ అయ్యారు.

Full View


Tags:    

Similar News