Minister KTR : ఇవాల్టి నుంచి మంత్రి కేటీఆర్‌ విదేశీ పర్యటన

Minister KTR : తెలంగాణకు భారీ పెట్టుబడుల సాధనే లక్ష్యం.. మంత్రి కేటీఆర్‌ ఇవాల్టి నుంచి పది రోజుల పాటు విదేశీ పర్యటన చేయనున్నారు.

Update: 2022-05-17 02:15 GMT

Minister KTR : తెలంగాణకు భారీ పెట్టుబడుల సాధనే లక్ష్యం.. మంత్రి కేటీఆర్‌ ఇవాల్టి నుంచి పది రోజుల పాటు విదేశీ పర్యటన చేయనున్నారు. ఉదయం పది గంటలకు ఆయన శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి లండన్‌కు వెళతారు.

అక్కడ మూడ్రోజుల పాటు వివిధ సంస్థల అధిపతులు, సీఈవోలతో భేటీ అవుతారు. అనంతరం.. అ్కడనుంచి స్విట్జర్లాండ్‌కు పయనమవుతారు. దావోస్‌లో ఈ నెల 22 నుంచి 26వరకు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొంటారు.

ఈ సదస్సుకు హాజరయ్యే పారిశ్రామికవేత్తలు, కంపెనీల అధిపతులు, సీఈవోలతో సమావేశమవుతారు. ఈనెల 26న తిరిగి రాష్ట్రానికి వస్తారు. ఆయన వెంట పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌తో పాటు ఇతర అధికారులు ఈ పర్యటనలో పాల్గొంటారు.

Tags:    

Similar News