Minister KTR : మెట్రో రైల్ టైమింగ్స్ సమస్యపై నెటిజన్ వీడియోకు స్పందించిన కేటీఆర్
Minister KTR : మెట్రో రైల్ టైమింగ్స్ సమస్య గురించి ట్విట్టర్‌లో నెటిజన్ పోస్ట్ చేసిన వీడియోకు మంత్రి కేటీఆర్ స్పందించారు.;
Minister KTR : మెట్రో రైల్ టైమింగ్స్ సమస్య గురించి ట్విట్టర్‌లో నెటిజన్ పోస్ట్ చేసిన వీడియోకు మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రయాణికులు ఉదయం 6 గంటల నుంచే మెట్రోకు చేరుకుంటారని.. కానీ మెట్రో 7 గంటలకు ప్రారంభంకావడంతో వేచి చూడాల్సి వస్తోందని.. ఉదయం వేళల్లో క్యాబ్ రేట్లు చాలా ఎక్కువగా ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ నెటిజన్ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో స్పందించిన మంత్రి.. ఉదయం 6 గంటలకే మెట్రోను అందుబాటులోకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి ట్యాగ్ చేస్తూ మంత్రి కేటీఆర్ రీట్విట్ చేశారు. కాగా మొదటి మెట్రో రైల్ ఉదయం 7 గంటలకు మొదలై.. రాత్రి 10.20 నిమిషాలకు చివరి స్టేషన్‌కు చేరుకుంటుంది.