డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో.. 5% దివ్యాంగులకు..
హైదారాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అర్హులైన వారికి త్రీవీలర్ మోటార్ బైక్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు కేటీఆర్ అందించారు.;
తెలంగాణలో దివ్యాంగుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదారాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అర్హులైన వారికి త్రీవీలర్ మోటార్ బైక్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు కేటీఆర్ అందించారు. తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా 24 కోట్ల రూపాయలతో దివ్యాంగులకు ఉచితంగా సహాయ పరికరాలు పంపిణీ చేస్తోందని చెప్పారు. 3 వేల 16 రూపాయలు పెన్షన్లు ఇస్తున్నామని.. 5 శాతం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను దివ్యాంగులకు కేటాయిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 4 శాతం రిజర్వేషన్లు దివ్యాంగుల కోసం అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు.