Kishan Reddy: రామప్ప దేవాలయం అభివృద్ధి పనులపై కిషన్ రెడ్డి సమీక్ష..
Kishan Reddy: ములుగు జిల్లాలోని చారిత్రక కట్టడం రామప్ప దేవాలయాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు.;
Kishan Reddy (tv5news.in)
Kishan Reddy: యునెస్కో గుర్తింపు పొందిన చారిత్రక కట్టడం ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. రామప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామప్ప శిల్పకళా వైభవాన్ని తిలకించారు.
అనంతరం యునెస్కో నిబంధనల మేరకు రామప్ప దేవాలయంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, వసతులపై పర్యాటక శాఖ అధికారులతో కేంద్ర మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర- రాష్ట్ర పర్యాటక శాఖ, పురావస్తు శాఖ అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు.
అంతకుముందు గట్టమ్మ టెంపుల్ దగ్గరలో నిర్మించిన హరిత గ్రాండ్ హోటల్, కాటేజీలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్, పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్ శ్రీనివాస్ గుప్తా, ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు.