Minister Ponnam : క్షమాపణ చెప్పకుండా ధర్నాలు చేయడమేంటి? : మంత్రి పొన్నం
నిన్న సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి స్పీకర్ ను ఉద్దేశించి సభ మీ ఒక్కడిది కాదు అని మాట్లాడడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. స్పీకర్ మీకు మళ్ళీ అవకాశం ఇచ్చి పొరపాటు అంటుంటే అవును సభ మీది కాదు అని మాట్లాడారని అన్నారు. చేసిన తప్పుకు క్షమాపణలు చెప్ప కుండా బీఆర్ఎస్ నాయకులు ధర్నాలు చే యడమేంటని పొన్నం ప్రశ్నించారు. కనీసం తమను సంప్రదించలేదని, చెప్పుకోవడానికి అవకాశం కూడా ఇవ్వలేదని బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం సరికాదన్నారు. రాష్ట్రంలో నిరస నలకు బీఆర్ఎస్ పిలుపునివ్వం హాస్యాస్పదం అని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడడా నికి కనీసం జ్ఞానం అయినా బీఆర్ఎస్ పార్టీకి రావాలి అని పేర్కొన్నారు. సభలో ఏ విధంగా ఉండాలి సభ వేదికపై ఏ విధంగా ప్రవర్తించా లో తెలిసి కూడా ఇలా చేస్తున్నారంటే ఇది ఉద్దే శపూర్వకంగా చేస్తున్నారని అనేది అర్థం అవు తోందన్నారు. సభకు కొన్ని సంప్రదాయాలు పద్దతులు ఉంటాయని, ఉదాహరణకు అబద్ధం అనడానికి కూడా వీలు లేదని సత్య దూరం అని మాత్రమే అనాలని అన్నారు. సభ మీ ఒక్కడిదా అంటే ఎలా అని అన్నారు. ఆయన శాసన సభకు అధిపతి అని అందులోనే అర్థం ఉందని అన్నారు. దళితుడు కాబట్టి ఆ విధంగా వ్యవహరించారని ఆరోపించారు. ఇదే బీఆర్ఎ స హయాంలో శాసన మండలి చైర్మన్ మీద కాగితాలు పడేశారనే సాకుతో ఇద్దరు సభ్యుల ను తొలగించి బర్తరఫ్ చేశారని గుర్తు చేశారు.