REVANTH: దేశ రక్షణలో రాజీపడబోం: రేవంత్ రెడ్డి

దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ శంకుస్థాపన... రాజ్ నాథ్ తో కలిసి భూమిపూజ చేసిన రేవంత్ రెడ్డి;

Update: 2024-10-16 03:00 GMT

దేశ రక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశ రక్షణ సంస్థలకు హైదరాబాద్ కేంద్రంగా ఉందని గుర్తు చేశారు. దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్... తెలంగాణ రాష్ట్రానికి ఇది మరో ముందడుగన్నారు. వికారాబాద్ జిల్లా పూడూర్‌లో భారత నౌకాదళానికి సంబంధించిన ‘వెరీ లో ఫ్రీక్వెన్సీ’ కమ్యూనికేషన్‌ ట్రాన్స్‌మిషన్‌ స్టేషన్‌ రాడార్‌ కేంద్రానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శంకుస్థాపన చేశారు. డిఫెన్స్ సంస్థలకు వ్యూహాత్మకంగా హైదరాబాద్ సిటీ సేఫ్ ప్లేస్ అన్నారు. దామగుండంపై చాలా మంది వివాదాలు చేయాలని చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. దామగుండం రాడార్ స్టేషన్ నిర్మాణంతో ఎవరికీ నష్టం లేదన్నారు. తమిళనాడులో34 ఏళ్లుగా రాడార్ స్టేసన్ ఉన్నా ఎలాంటి నష్టం లేదన్నారు. ప్రాజెక్టు ప్రాధాన్యతను తెలంగాణ సమాజం గుర్తించాలని రేవంత్ పిలుపునిచ్చారు. దేశ రక్షణ కోసం రాజీపడొద్దనే ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చామని రేవంత్ అన్నారు. దేశ రక్షణ విషయంలో రాజకీయాలు చేయబోమని... కలిసి నడుస్తామని రేవంత్ అన్నారు. దేశ రక్షణ కోసం పెడుతున్న ప్రాజెక్టులపై రాజకీయం చేసేవారు ఆలోచించాలన్నారు. రాడార్ స్టేషన్ నిర్మాణంలో ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. దేశభద్రత చాలా ముఖ్యమని.. రాడార్ స్టేషన్ పై కొందరు లేనిపోని ఆరోపణలు సృష్టిస్తున్నారని విమర్శించారు రేవంత్.

పర్యావరణ ప్రేమికులకు కీలక పిలుపు

పర్యావరణ ప్రేమికులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. దేశం, దేశ ప్రజలు సురక్షితంగా ఉంటేనే పర్యావరణ రక్షణ గురించి ఆలోచించగలుగుతాని అన్నారు. దేశ భద్రతకు సంబంధించిన ప్రాజెక్ట్‌ను వివాదాస్పదం చేయడం సమంజసం కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాల గురించి ఆలోచించాలని అన్నారు. దేశ రక్షణ విషయంలో అందరూ కలిసికట్టుగా ముందుకెళ్లాలని చెప్పారు. దేశ రక్షణలో తెలంగాణ మరో కీలక అడుగు ముందుకు వేయబోతోందన్నారు.

దేశ భద్రత విషయంలో రాజకీయాలా? : రాజ్ నాథ్

దేశ భద్రత విషయంలో రాజకీయాలు తగదని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. దామగుండం నేవీ రాడార్‌ స్టేషన్‌కు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న రాజ్ నాథ్.. దేశ కమ్యూనికేషన్ వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉందన్నారు. నేవీ రాడార్ స్టేషన్ దేశ రక్షణలో అత్యంత కీలకమని వెల్లడించారు. సముద్ర గర్భంలో ఖనిజాలపై ఎన్నో దేశాలు కన్నేశాయని గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో నేవీ రాడార్ స్టేషన్ భారత్‌కు కీలకంగా మారనుందన్నారు.

Tags:    

Similar News