వేములవాడ ఆలయ ఘటనపై తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సురేఖ ఆరా తీశారు. ఎండోమెంట్ కమిషనర్, వేములవాడ ఆలయ ఈవోలను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాజన్న ఆలయ విస్తీర్ణం విషయంలో అపోహలు నెలకొన్నాయని మంత్రికి తెలిపారు ఆలయ సిబ్బంది. భక్తులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు అందజేసేందుకు ఆలయ విస్తీర్ణం పెంచాలనే చర్యలు తీసుకున్నట్టు తెలిపారు మంత్రి. ప్రధాన ఆలయ విస్తీర్ణం, భీమేశ్వరాలయంలో భక్తులకు దర్శన సౌకర్యం కు సంబంధించిన పనులు చేపడుతున్నట్టు క్లారిటీ ఇచ్చింది. అయితే, స్థానికంగా అన్నివర్గాల ప్రజలతో చర్చించి ముందుకు వెళ్ళాలని... ఎక్కడా ఎటువంటి అనుమానాలు, ఇబ్బందులకు తావు ఇవ్వకుండా ముందుకు వెళ్ళాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు మంత్రి.