రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు లేవు... భయపడాల్సిన అవసరం లేదు : తలసాని

రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు లేవని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌.

Update: 2021-01-06 11:32 GMT

రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు లేవని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌. బర్ల్ ఫ్లూ నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై ఉన్నతస్థాయి అధికారులతో మాసబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి, VBRI అధికారులు, పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పశుసంవర్ధక శాఖ తీసుకున్నముందు జాగ్రత్త చర్యల కారణంగా రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తికి అవకాశం లేదన్నారు. రాష్ట్రంలో 13 వందల బృందాలు నిరంరతరం వైద్య పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని.. తలసాని తెలిపారు. బర్డ్‌ ఫ్లూను ఎదుర్కొనేందుకు.. అన్ని స్థాయిల్లోనూ అధికారులను అప్రమత్తం చేశామన్నారు.

Tags:    

Similar News