Mahabubabad: ఎంపీ కవిత చేతుల్లో నుంచి మైక్ లాగేసుకున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్..
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్ చేపట్టిన నిరసన.. పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరును బహిర్గతం చేసింది.;
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్ చేపట్టిన నిరసన.. పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరును బహిర్గతం చేసింది. నిరసన దీక్షణలో ఎంపీ మాలోతు కవిత మాట్లాడుతుండగా.. ఎమ్మెల్యే శంకర్ నాయక్ తాను మాట్లాడుతానంటూ బలవంతంగా మైక్ లాగేసుకున్నారు. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నది తానంటూ కవిత చెప్పినా శంకర్ నాయక్ వినిపించుకోలేదు. బలవంతంగా మైక్ లాగేసుకోవడం చూసి కార్యకర్తలు, నాయకులు అవాక్కైపోయారు.
ఆ తర్వాత కూడా సభాధ్యక్షత ఎవరు వహించాలన్న దానిపై కూడా నేతల మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రి సత్యవతి రాథోడ్.. ఎమ్మెల్యే శంకర్ నాయక్ సభకు అధ్యక్షత వహిస్తారని ప్రకటించగా.. మాజీ మంత్రి రెడ్యానాయక్ దాన్ని వ్యతిరేకిస్తూ.. జిల్లా అధ్యక్షురాలిగా ఉన్న కవితనే నాయకత్వం వహిస్తారని వెల్లడించారు. దీంతో ఇరువర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి.