MLC Kavita : బీఆర్‌ఎస్‌పై దేశవ్యాప్తంగా చర్చ: ఎమ్మెల్సీ కవిత

MLC Kavita : నిజామాబాద్‌లో పర్యటించిన ఆమె లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు.;

Update: 2022-12-22 06:43 GMT

MLC Kavitha: బీఆర్‌ఎస్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్‌లో పర్యటించిన ఆమె లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేసేందుకు ఎంతోమంది ఆసక్తి చూపిస్తున్నారని.. ఇతర రాష్ట్రాల నుంచి బీఆర్‌ఎస్‌కు అద్భుత స్పందన వస్తోందన్నారు కవిత.


అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుందని.. దేశంలో ఎక్కడైనా కళ్యాణలక్ష్మి పథకం ఉందా? అని ప్రశ్నించారు. దేశంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు తెస్తామని అన్నారు. అటు.. నగరంలో పాత భవనాల కూల్చివేతలపై బీజేపీ అనవసర ఆందోళనలు చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పాలనలో అసంతృప్తిగా వదిలేసిన అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులను తాము పూర్తి చేశామని చెప్పారు.

Tags:    

Similar News