JAGRUTHI: ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ జాగృతి అధ్యక్షుల నియామకం
త్వరలోనే ఆయా దేశాల్లో పూర్తిస్థాయి కమిటీలను వెల్లడిస్తామన్న కవిత;
తెలంగాణ జాగృతిని విస్తరించేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల కోసం పలు పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపారు కవిత. సమాజంలోని అన్ని వర్గాలవారికి తెలంగాణ జాగృతి ద్వారా చేరువకావడానికి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన సంస్థ తెలంగాణ జాగృతికి విదేశాల్లో అధ్యక్షులను ప్రకటించారు. త్వరలోనే ఆయా దేశాల్లో పూర్తిస్థాయి కమిటీలను వెల్లడిస్తామని కవిత తెలిపారు. తెలంగాణ జాగృతి అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన వారు తెలంగాణ అభ్యున్నతికి, ఆయా దేశాల్లో ఉన్న తెలంగాణ వాసుల సంక్షేమానికి కృషి చేయాలన్నారు. తాజా నియామకాలన్నీ వెంటనే అమల్లోకి వస్తాయన్నారు. మహారాష్ట్ర శాఖకు అధ్యక్షుడిగా శ్రీనివాస్ సుల్గేను నియమించారు. కాగా, కేసీఆర్‌కు రాసిన లేఖ బయటపడడంతో బీఆర్‌ఎస్‌కు ఆమె స్వస్తి చెప్పి కొత్త పార్టీ పెట్టనున్నారనే వార్తలు ఊపందుకున్న నేపథ్యంలో కవిత తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది.
వివిధ దేశాల అధ్యక్షులు వీరే :
న్యూజిలాండ్ - అరుణ జ్యోతి ముద్దం, గల్ఫ్ - చెల్లంశెట్టి హరిప్రసాద్
ఖతార్ - మూకల ప్రవీణలక్ష్మి, అడ్వైజర్ - నందిని అబ్బగోని
యూఏఈ - పీచర వేంకటేశ్వర రావు, ప్రధాన కార్యదర్శి శేఖర్ గౌడ్
కువైట్ - మర్క ప్రమోద్ కుమార్, సౌదీ అరేబియా - మహమ్మద్ మొజ్జం అలీ ఇఫ్తెకార్
ఒమన్ - గుండు రాజేందర్ నేత, యూకే - సుమన్ రావు బల్మూరి
ఇటలీ - తానింకి కిశోర్ యాదవ్, ఫిన్లాండ్ - ఐరెడ్డి సందీప్ రెడ్డి
పోర్చుగల్ - ప్రకాశ్ పొన్నకంటి, మాల్టా- పింటు ఘోష్
కెన్యా - స్వప్నరెడ్డి గంట్ల, ఇరాక్ & కుర్దిస్తాన్- మహ్మద్ సల్మాన్ ఖాన్, ప్రధాన కార్యదర్శి నాయక్వార్ రాం చందర్