కాల్వలు తవ్వకుండానే కోట్లు దండుకున్నారు: ఎమ్మెల్సీ కవిత
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నిజమైన నాయకుడని ఎమ్మెల్సీ కవిత అన్నారు;
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నిజమైన నాయకుడని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సమైక్య పాలనలో గ్రామాలు కరువుతో తల్లడిల్లాయని.. నేడు ఎక్కడ చూసినా పచ్చని పైర్లే కనిపిస్తున్నాయని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఆమె.. సాగునీటి దినోత్సవంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనలో కాలువలు తవ్వకుండానే వేల కోట్లు దండుకున్నారని కవిత ఆరోపించారు. చేసిన అభివృద్ధి చెప్పే సత్తా కేసీఆర్‌కే ఉందన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పునరుద్ధరించామని.. అందుకే నేడు పుష్కలంగా సాగునీరు అందుతోందని చెప్పారు. కాళేశ్వరం ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.