కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ..!
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిశారు.;
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిశారు. పర్యాటక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి అభినందించిన కోమటిరెడ్డి.. భువనగిరిలో టూరిజం అభివృద్ధిపై చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధితో పాటు పలు రాజకీయ అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్‌గా నియమించడంతో అసంతృప్తిగా ఉన్న కోమటిరెడ్డి.. నియోజవకవర్గ అభివృద్ధి పనులపై దృష్టిసారిస్తున్నారు. ఢిల్లీలో వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఐతే.. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో కిషన్‌రెడ్డితో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.