కేసీఆర్‌ను గద్దె దించాలని ప్రజలు ఆవేశంగా ఉన్నారు: రేవంత్
తెలంగాణ కోసం చనిపోయిందెవరో.. ఇప్పుడు తెలంగాణ సంపదను దోచుకుంటున్నదెవరో ప్రజలు ఆలోచించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.;
తెలంగాణ కోసం చనిపోయిందెవరో.. ఇప్పుడు తెలంగాణ సంపదను దోచుకుంటున్నదెవరో ప్రజలు ఆలోచించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. మరో 18 నెలల్లో సీఎం కేసీఆర్‌ను గద్దె దించాలని ప్రజలు ఆవేశంగా ఉన్నారని ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో 'దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా' బహిరంగ సభలో మాట్లాడిన రేవంత్‌రెడ్డి.... తెరాస పాలనలో కృష్ణానది ఉప్పొంగినట్టు కాంగ్రెస్ సభకు ప్రజలు వచ్చారని అన్నారు. కాంగ్రెస్ సభలు చూసి కేసీఆర్ గుండెల్లో గునపం దిగినట్టుందని విమర్శించారు. దళిత బంధు కింద ఇచ్చే 10లక్షల రూపాయలు ఎవరి భిక్షం కాదని అన్నారు. టీఆర్‌ఎస్ ఏడేళ్ల పాలనలో దళిత, గిరిజన వర్గాలు దోపిడీకి గురయ్యాయని విమర్శించారు. వర్షంలో తడుస్తూనే రేవంత్‌రెడ్డి తన ప్రసంగం కొనసాగించారు.