MUNCIPAL POLL: పురపాలక ఉత్కంఠకు నేటితో తెర

నేడు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్... ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అభ్యర్థులు... 80 శాతాలు తమవే అంటున్న కాంగ్రెస్

Update: 2026-02-13 02:30 GMT

తె­లం­గా­ణ­లో ఉత్కంఠ నడుమ ము­న్సి­ప­ల్ ఎన్ని­కల కౌం­టిం­గ్ నేడు జర­గ­నుం­ది. రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా 7 కా­ర్పొ­రే­ష­న్లు, 116 ము­న్సి­పా­లి­టీ­ల్లో నేడు ఓట్ల లె­క్కిం­పు జర­గ­నుం­ది. రా­ష్ట్ర వ్యా­ప్తం­గా 116 ము­న్సి­పా­లి­టీ­లు, 7 ము­న్సి­ప­ల్ కా­ర్పొ­రే­ష­న్ల­లో తమ పట్టు ని­లు­పు­కు­నేం­దు­కు ప్ర­ధాన పా­ర్టీ­లు తీ­వ్రం­గా శ్ర­మిం­చా­యి. పలు చో­ట్ల పోటీ కాం­గ్రె­స్‌, బీ­ఆ­ర్‌­ఎ­స్ అన్న­ట్లు కొ­న­సా­గిం­ది. ప్ర­త్య­ర్థు­లు ఒక­రి­పై ఒకరు మాటల తూ­టా­లు పే­ల్చు­కు­న్నా­రు. ఒక దశలో ప్ర­చా­రం­లో ప్ర­ధాన పా­ర్టీల నే­త­లు తి­ట్ల­పు­రా­ణం అం­దు­కు­న్నా­రు. అన్ని పా­ర్టీల హా­మీ­లు, ప్ర­చా­రా­న్ని ని­శి­తం­గా గమ­నిం­చిన ఓట­ర్లు పా­ర్టీల భవి­ష్య­త్ ను, అభ్య­ర్థుల అదృ­ష్టా­న్ని ఓటు రూ­పం­లో బ్యా­లె­ట్ బా­క్కు­ల్లో ని­క్షి­ప్తం చే­శా­రు. ఓట­ర్లు ఏ ము­న్సి­పా­లి­టీ­లో ఏ పా­ర్టీ­కి పట్టం కట్టా­రో నేడు తే­ల­నుం­ది. మొ­త్తం 116 ము­న్సి­పా­లి­టీ­ల­లో­ని 2582 వా­ర్డు­ల­కు గాను 12 వా­ర్డు­లు ఏక­గ్రీ­వం కాగా ఒక చోట వా­యి­దా పడిం­ది. దీం­తో ఇవాళ 2569 వా­ర్డు­ల­కు పో­లిం­గ్ జరి­గిం­ది. ఇక 7 ము­న్సి­ప­ల్ కా­ర్పొ­రే­ష­న్ల­కు సం­బం­ధిం­చి 414 వా­ర్డు­ల్లో 2 వా­ర్డు­లు ఏక­గ్రీ­వం అయ్యా­యి.మి­గి­లిన 412 వా­ర్డు­ల­కు పో­లిం­గ్ ని­ర్వ­హిం­చా­రు. వీటి ఫలి­తా­ల­న్నీ నేడు తే­ల­ను­న్నా­యి. ఫలితాలపై అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

80 శాతానికిపైగా స్థానాలు మావే

పం­చా­య­తీ ఎన్ని­క­ల్లో సత్తా చా­టిన కాం­గ్రె­స్, పు­ర­పా­లి­క­ల్లో­నూ తి­రు­గు­లే­ద­ని ధీ­మా­గా ఉంది. అభి­వృ­ద్ధి, సం­క్షేమ కా­ర్య­క్ర­మా­ల­ను చూసి పట్టణ ఓట­ర్లు తమకే పట్టం కడ­తా­ర­ని అధి­కార పా­ర్టీ నే­త­లు అం­చ­నా వే­స్తు­న్నా­రు. 116 ము­న్సి­పా­లి­టీ­లు, 7 ము­న్సి­ప­ల్ కా­ర్పొ­రే­ష­న్ల­లో జరి­గిన ఎన్ని­క­ల్లో 80 శా­తా­ని­కి పైగా స్థా­నా­లు దక్కు­తా­య­ని కాం­గ్రె­స్‌ వి­శ్వా­సం వ్య­క్తం చే­స్తోం­ది. ఎగ్జి­ట్ పో­ల్స్ అం­చ­నా­ల­కు దగ్గ­ర­గా­నే ఫలి­తా­లు ఉం­డ­బో­తు­న్న­ట్లు పా­ర్టీ వర్గా­లు వి­శ్లే­షి­స్తు­న్నా­యి. ము­న్సి­ప­ల్ ఎన్ని­క­ల­ను కాం­గ్రె­స్ ప్ర­తి­ష్టా­త్మ­కం­గా తీ­సు­కుం­ది. అసెం­బ్లీ, పం­చా­య­తీ తర­హా­లో­నే పట్ట­ణా­ల్లో­నూ ఆధి­ప­త్యం సా­ధిం­చా­ల­ని ప్ర­ణా­ళి­కా­బ­ద్ధం­గా పని చే­సిం­ది. ఫలి­తాల సర­ళి­ని అం­చ­నా వే­సిన అధి­కార పా­ర్టీ నా­య­కు­లు, ఉమ్మ­డి నల్గొండ, మహ­బూ­బ్‌­న­గ­ర్ జి­ల్లా­ల్లో క్లీ­న్ స్వీ­ప్ చేసే అవ­కా­శా­లు ఉన్నా­య­ని తే­ల్చి చె­బు­తు­న్నా­రు. ఖమ్మం జి­ల్లా­లో­నూ ఏక­ప­క్ష ఫలి­తా­లు వచ్చే సూ­చ­న­లు కని­పి­స్తు­న్నా­య­ని అం­చ­నా వే­స్తు­న్నా­రు. ఉమ్మ­డి మె­ద­క్, వరం­గ­ల్ జి­ల్లా­ల్లో బీ­ఆ­ర్ఎ­స్,–కాం­గ్రె­స్ మధ్య గట్టి పోటీ నె­ల­కొ­న్న­ట్లు భా­వి­స్తు­న్నా­రు.

Tags:    

Similar News